Categories: Movie News

బంగళా భూతాలు ఏమంటున్నాయి

దురంధర్ ది రివెంజ్ ఊచకోత తర్వాత బాలీవుడ్ లో మరో చెప్పుకోదగ్గ స్టార్ హీరో సినిమా రాలేదు. దీని వసూళ్లు స్టడీగా ఉండటం వల్లే ఏప్రిల్ 10 రావాల్సిన అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా వారం ఆలస్యంగా ఏప్రిల్ 17 థియేటర్లలో అడుగు పెట్టింది. కామెడీ చిత్రాల కల్ట్ మేకర్ ప్రియదర్శన్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే నెలకొన్నాయి. ముందు రోజు రాత్రే తెలుగు రాష్ట్రాల ప్రధాన కేంద్రాలతో పాటు దేశమంతా స్పెషల్ ప్రీమియర్లు వేశారు. ఇంతకీ భూతాలు భయపెట్టాయా.

ముందుగా స్టోరీ విషయానికి వస్తే మంగళ్ పూర్ అనే ఊరిలో ఏదైనా వివాహం తలపెడితే చాలు ఒక ఆకారం వచ్చి పెళ్లి కూతురుని ఎత్తుకుపోతుంది. విదేశాల్లో ఉండే అర్జున్ ఆచార్య (అక్షయ్ కుమార్) తాతయ్య చావు వల్ల చెల్లెలి పెళ్లి మంగళ్ పూర్ లోని పాత బంగళాలో చేయాలని నిర్ణయించుకుని ఇండియా వస్తాడు. అంతా సవ్యంగా ప్లాన్ చేసుకుంటున్న టైంలో దుష్టశక్తి ఎంట్రీ ఇస్తుంది. దాని పని పట్టేందుకు అర్జున్ ఏం చేశాడనే దాని మీద అసలు కథ నడుస్తుంది.

స్త్రీ 2, భూల్ భులయ్యా 2 & 3, ముంజ్యా లాంటి హారర్ మూవీస్ చాలానే చూసిన ఆడియన్స్ కి భూత్ బంగ్లా మరీ కొత్తగా అనిపించదు. అక్షయ్ కుమార్, పరేష్ రావల్ లాంటి ఆరిస్టుల కామెడీ టైమింగ్ తో చాలా సన్నివేశాలు కాలక్షేపం చేయించాయి కానీ అధిక శాతం రెగ్యులర్ ట్రీట్ మెంట్ లోనే సాగుతుంది. ఇంటర్వెల్ నుంచి అసలు ట్విస్టులు మొదలవుతాయి. దెయ్యాలకు ఫాంటసీ, పురాణాల లాంటి అదనపు హంగులు జోడించడం వల్ల కొంచెం కొత్తదనం వచ్చింది.

నార్త్ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తుంటే భూత్ బంగ్లా అద్భుతాలు చేసే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. కమర్షియల్ గా గట్టెక్కుతుందా లేదానేది వీకెండ్ అయ్యాక బయట పడుతుంది. దురంధర్ 2 నెమ్మదించినప్పటికీ పూర్తిగా ఆగిపోలేదు. శని ఆదివారాలు వస్తే చాలు లక్షన్నరకు తక్కువ టికెట్లు అమ్మడం లేదు. బిసి సెంటర్లలో ఒకటే సెలవు తీసుకుంది. మల్టీప్లెక్సుల్లో స్ట్రాంగ్ గానే ఉంది. దీని సంగతలా ఉంచితే అక్షయ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న బ్లాక్ బస్టర్ కోరిక నెరవేరే సూచనలు తక్కువగానే ఉన్నాయి.

Share

Recent Posts

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

6 minutes ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

2 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

3 hours ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

3 hours ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

4 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

5 hours ago