Movie News

తండెల్ దర్శకుడి సినిమాకు పెద్ద బ్రేక్?

చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన ముద్ర వేశాడు. ఆ తర్వాత ‘సవ్యసాచి’తో నిరాశపరిచినా.. ఆపై కార్తికేయ-2, తండేల్ చిత్రాలతో విజయాలందుకున్నాడు.

చందూతో ఈసారి ఒక భారీ యానిమేషన్ సినిమా చేయడానికి టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ నాగవంశీ రెడీ అయ్యాడు. గత ఏడాది యానిమేషన్ మూవీ ‘మహావతార నరసింహ’ భారీ విజయాన్నందుకున్న నేపథ్యంలో అదే తరహాలో ఆంజనేయుడి కథతో ‘వాయుపుత్ర’ తీయాలని వీళ్లిద్దరూ సంకల్పించారు. 

దాదాపు ఏడాది నుంచి ఈ ప్రాజెక్టు మీద పని చేస్తున్నాడు చందూ మొండేటి. ఈ ప్రాజెక్టు గురించి నాగవంశీ మీడియా ముందు కూడా ఎంతో ఎగ్జైట్ అయ్యాడు. త్వరలో అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ వస్తుందని కూడా గతంలో చెప్పాడు. కానీ ఇప్పుడేమో ఈ ప్రాజెక్టుకు బ్రేక్ పడిందంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ యానిమేషన్ మూవీని చందూ విజన్‌కు తగ్గట్లు తీయాలంటే బడ్జెట్ కొంచెం ఎక్కువే అవుతుందని.. కానీ బిజినెస్ పరంగా ఆ బడ్జెట్‌ను వర్కవుట్ చేయడం కష్టమని భావిస్తున్నారట. ఇటీవల డిజిటల్ మార్కెట్ బాగా దెబ్బ తినేయడం వల్ల అనుకున్న రేట్లు రావట్లేదు. 

నాగవంశీ సినిమాలను రెగ్యులర్‌గా కొనే ఓటీటీ సంస్థ.. ‘వాయుపుత్ర’కు ఆఫర్ చేసిన రేటు ప్రకారం ఈ సినిమా బడ్జెట్‌ను వర్కవుట్ చేయడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారట. ఈ సినిమాను క్యాన్సిల్ చేయడం కాదు కానీ.. హోల్డ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది.

మార్కెట్ సరిగా లేని నేపథ్యంలో ప్రస్తుతానికి ఆపి, పరిస్థితులు మారాక దీన్ని పట్టాలెక్కించాలని చూస్తున్నారట. ఈలోపు వంశీ, చందూ వేరే సినిమా కోసం చేతులు కలిపే అవకాశముంది. ఎవరైనా స్టార్ హీరోతో రెగ్యులర్ సినిమానే తీయాలని చూస్తున్నారట. త్వరలోనే దీని గురించి క్లారిటీ రావచ్చు.

This post was last modified on April 9, 2026 7:47 pm

Share

Recent Posts

అనుమానం రాకుండా అంతర్ధానం అవుతోంది

చిన్న సినిమాల్లో విషయం ఉంటే ఆదరణ దక్కి తీరుతుంది. ఈ విషయంలో తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. సీతాకోకచిలుక నుంచి…

18 minutes ago

జడలు విదిలించిన వసూళ్లు… ఇకపై అసలు సవాళ్లు

బుధవారం ప్రీమియర్లతో గురువారం విడుదల ఎంచుకున్న ది ప్యారడైజ్ ఎట్టకేలకు మొదటి వీకెండ్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రాధమిక సమాచారం…

2 hours ago

అమ్మ చేతులు అడుక్కోకూడదు

తెలుగులో లెజెండరీ స్టేటస్ ఉన్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు. బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న…

2 hours ago

యువకుడి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి

ఈ మధ్యకాలంలో కొందరు రాజకీయ నేతలు తమను తాము వేరే లెవల్లో ఊహించుకుంటున్నారు. ప్రజలు ఎన్నుకుంటేనే తాము ప్రజాప్రతినిధులుగా చలామణీ…

2 hours ago

గ్రేట‌ర్‌లో పుంజుకునేదెలా… కారు పార్టీ కుస్తీలు

గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీకి వ‌రుస దెబ్బ‌లు త‌గులుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత‌.. పార్టీ పుంజుకుంటున్న ప‌రిస్థితి…

4 hours ago

సూర్య‌తో సినిమా ఎప్పుడు… రాజ‌మౌళి జ‌వాబేంటి?

రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని ఇప్పుడు ఇండియాలో ఉన్న‌ ప్ర‌తి పేరున్న హీరో ఆశ‌ప‌డుతుంటాడు అన‌డంలో సందేహం లేదు. ఐతే రాజ‌మౌళి…

5 hours ago