Movie News

హ్యాట్రిక్ హీరో సినిమాకు ఈ పరిస్థితా?

వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు అందించిన హీరో నుంచి వస్తున్న తర్వాతి సినిమాకు మామూలుగా హైప్ ఒక రేంజిలో ఉంటుంది. ఆ సినిమాను బయ్యర్లు ఎగబడి కొంటారు. ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. కానీ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ చిత్రాలతో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్లు కొట్టిన ప్రదీప్ రంగనాథన్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతోంది.

రకరకాల కారణాల వల్ల ఈ చిత్రం బాగా ఆలస్యం అయింది. హీరోగా ప్రదీప్ తొలి చిత్రం ‘లవ్ టుడే’ తర్వాత రిలీజ్ కావాల్సిన సినిమా కాస్తా.. నాలుగో మూవీగా వస్తోంది. ఆలస్యానికి తోడు ఈ సినిమా ప్రోమోలు ఎగ్జైటింగ్‌గా లేకపోవడం వల్ల దీనికి అనుకున్నంతగా బజ్ క్రియేట్ కాలేదు. సడెన్‌గా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ప్రమోషన్లు చేయగా.. ప్రేక్షకుల్లో హైప్ తీసుకురాలేకపోయారు. దీంతో అటు తమిళంలో, ఇటు తెలుగులో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎల్ఐకే’ సినిమాను లలిత్ కుమార్ అనే నిర్మాతతో కలిసి నయనతారనే నిర్మించింది. బయ్యర్ల నుంచి డిమాండ్ లేక తమిళంలో తక్కువ రేట్లకు సినిమాను అమ్మారు. కొన్ని ఏరియాల్లో సొంతంగా రిలీజ్ చేసుకుంటున్నారు. తెలుగులో ఈ సినిమాకు డిమాండ్ లేదు. లో బజ్‌తో రిలీజవుతోంది.

అడ్వాన్స్ బుకింగ్స్ అంతంతమాత్రంగా ఉన్నాయి. రేపు రిలీజ్ అంటే రెండంకెల సంఖ్యలో టికెట్లు బుక్ అయిన థియేటర్లు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక యుఎస్‌లో ఈ సినిమా పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ముందు ఒక పేరున్న డిస్ట్రిబ్యూషఐన్ సంస్థ ఈ సినిమా హక్కులు తీసుకుంది. కానీ రిలీజ్ దగ్గరికొచ్చాక ఆ సంస్థ తప్పుకుంటే పెద్దగా గుర్తింపు లేని వేరే రెండు సంస్థలతో డీల్ మార్చుకుని సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మార్పు వల్ల బుకింగ్స్ ఆలస్యం అయ్యాయి.

రేపు రిలీజ్ అంటే ఈ రోజు బుకింగ్స్ మొదలుపెడితే.. రెస్పాన్స్ ఆశాజనకంగా లేదు. మొత్తంగా ‘ఎల్ఐకే’కు ఏదీ కలిసి రావడం లేదు. రేపు సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప సినిమా పుంజుకునేలా కనిపించడం లేదు. తన నుంచి వరుసగా మూడు వంద కోట్ల సినిమాలు వచ్చిన నేపథ్యంలో తనపై చాలా ఒత్తిడి ఉందని.. ‘ఎల్ఐకే’కు వంద కోట్లు రాకపోతే ఫెయిల్యూర్ అనేలా ఉన్నారని.. తన దృష్టిలో సినిమా ప్రేక్షకులకు నచ్చిందా లేదా అన్నదే ముఖ్యమని హీరో ప్రదీప్ రంగనాథన్ వ్యాఖ్యానించడాన్ని బట్టి ఈ సినిమాపై తనకూ తక్కువ అంచనాలే ఉన్నట్లు కనిపిస్తోంది.

This post was last modified on April 9, 2026 2:20 pm

Share

Recent Posts

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

37 minutes ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

40 minutes ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

2 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

3 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

5 hours ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

5 hours ago