ఒకప్పుడు మలయాళంలో సాఫ్ట్ పోర్న్ సినిమాలతో యువతను ఉర్రూతలూగించడంతో పాటు అక్కడి సినీ పరిశ్రమలో కలవరం రేపిన శృంగార తార షకీలా జీవిత కథ ఆధారంగా ఆమె పేరుతోనే ఓ సినిమా తెరకెక్కడం తెలిసిన సంగతే. ఇందులో షకీలా పాత్రను బాలీవుడ్ భామ రిచా చద్దా పోషించింది. ఇంద్రజిత్ లంకేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శుక్రవారం క్రిస్మస్ కానుకగా విడుదల చేశారు.
హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజవడం విశేషం. ఐతే వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో మలుపులున్న ఒకప్పటి సంచలన శృంగార తార కథ.. రిచా చద్దా లాంటి మంచి నటి ప్రధాన పాత్ర పోషించిన నేపథ్యంలో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి ఉంటుందని అంచనా వేశారు బాక్సాఫీస్ పండిట్లు. కానీ తొలి రోజు షకీలా సినిమాకు కనీస స్పందన కరవైంది.
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలోనూ షకీలా సినిమాను జనాలు పట్టించుకోవట్లేదట. జనాలు లేక చాలా చోట్ల షోలు క్యాన్సిల్ చేసినట్లు బాలీవుడ్ ట్రేడ్ పండిట్ ఒకరు ట్వీట్ చేశారు. తొలి రోజు ఈ సినిమా రూ.25 లక్షల గ్రాస్ కలెక్ట్ చేయడం కూడా కష్టమే అని తేల్చేశాడంటే. ఈ సినిమా పరిస్థితేంటో అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే అన్నీ ఎగ్జాజరేషన్లలా కనిపించాయి.
ఈ సినిమాకు వచ్చిన స్పందన చూస్తుంటే షకీలా పట్ల కానీ.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కానీ ఇప్పటి ప్రేక్షకులకు ఏమాత్రం ఆసక్తి లేదనడానికి రుజువులా కనిపిస్తోంది. షకీలా సాఫ్ట్ పోర్న్ సినిమాల నుంచి నిష్క్రమించే సమయంలో ఈ సినిమా తీసి ఉంటే ఫలితం బాగుండేదేమో. ఇప్పుడు ఆమె పూర్తిగా లైమ్ లైట్ నుంచి వెళ్లిపోయింది. మలయాళంలో సాఫ్ట్ పోర్న్ సినిమాల జాడే లేదిప్పుడు. పదేళ్ల కిందటే వాటికి తెరపడింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాను జనాలు పట్టించుకుంటున్నట్లు లేరు.
This post was last modified on December 26, 2020 10:04 am
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…