రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. ఈ మూవీని రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు నిర్మిస్తున్నారు . ప్రస్తుతం ఈ చిత్రం చిత్రీకణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ దశలో ఉంది. ఇటీవల రానా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ గ్లింప్స్, సాయి కుమార్ లుక్, కార్తిక్ రత్నం లుక్ లకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. తాజాగా నవీన్ చంద్ర లుక్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు రవీంద్ర పుల్లే మాట్లాడుతూ…
అర్ధ శతాబ్దం సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రంజిత్ పాత్రలో నవీన్ చంద్ర నటిస్తున్నారు. ఈ లుక్ కి అన్ని వర్గాల నుంచి అద్భుత స్పందన వస్తోంది. అందరిని ఆలోచింపచేసే విధంగా ఈ మూవీ ఉంటుందని తెలిపారు.
నిర్మాత చిట్టి కిరణ్ రామోజు మాట్లాడుతూ…
సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. జనవరిలో టీజర్ విడుదల చేయబోతున్నాము. సినిమాకోసం అందరూ ఎంతో శ్రమించి పనిచేసి ఈ సినిమాను పూర్తి చేశారు, వారందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు.
సాంకేతిక నిపుణులు:
బ్యానర్: రిషిత శ్రీ క్రియేషన్స్
రచన,దర్శకత్వం: రవీంద్ర పుల్లే,
నిర్మాత: చిట్టి కిరణ్ రామోజు,
డిఓపి: అష్కర్, వెంకట్ ఆర్ శాఖమూరి
సంగీతం: నౌఫల్ రాజా (ఎ.ఐ.ఎస్)
ఆర్ట్: సుమిత్ పటేల్,
కాస్ట్యూమ్స్: పూజిత తాడికొండ
ఎడిటర్: జె. ప్రతాప్ కుమార్,
పాటలు: రెహమాన్,
స్టాంట్స్: అంజి,
పిఆర్ఓ: సాయి సతీష్.
This post was last modified on December 25, 2020 10:24 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…