ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ హాట్ హీరోయిన్లలో మృణాల్ ఠాకూర్ ఒకరు. చాలా వరకు సినిమా ప్రమోషన్లకు, ఈవెంట్లకు గ్లామర్ అవతారంలోనే వస్తుంది కాబట్టి.. మృణాల్ ఉందంటే కెమెరాలన్నీ తన చుట్టూనే తిరుగుతాయి. కానీ శనివారం మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపించింది. అసలు పేరు కూడా తెలియని ఒక కొత్తమ్మాయి మృణాల్‌ను డామినేట్ చేసి.. అందరి దృష్టినీ తన వైపు తిప్పేసుకుంది. హాట్ హాట్ అవతారంతో ‘డెకాయిట్’ ఈవెంట్‌లో హైలైట్ అయిన ఆ అమ్మాయి పేరు.. జైన్ మేరీ ఖాన్.
బాలీవుడ్ ‘ఖయామత్ సే ఖయామత్’ సహా పలు చిత్రాలు రూపొందించిన దర్శకుడు మన్సూర్ ఖాన్ కుమార్తెనే జైన్ మేరీ ఖాన్. ఆమె బాలీవుడ్లో మిసెస్ సీరియల్ కిల్లర్, మోనికా: ఓ మై డార్లింగ్ లాంటి సినిమాల్లో నటించింది. కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేసింది. తెలుగులో ఆమెకు ‘డెకాయిట్’యే తొలి సినిమా. ఇందులో తన పాత్రేంటన్నది తెలియదు. మృణాల్ ఉండగా ఇంకో లేడీ క్యారెక్టర్ గురించి ఎవరు పట్టించుకుంటారు? కానీ ‘డెకాయిట్’ ఈవెంట్లో మాత్రం మృణాల్ ఉన్న సంగతి మరిచిపోయి కెమెరాలన్నీ జైన్ చుట్టూనే తిరిగాయి.
లో నెక్ డ్రెస్‌తో క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ.. అందరి దృష్టినీ ఆకర్షించింది జైన్. ఆమె ఫొటోలు, వీడియోలు నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి. సినిమా ఈవెంట్లో ఈ రేంజిలో అందాల ఆరబోత ఏంటి బాబోయ్ అంటూ నోరెళ్లబెట్టి చూశారు అందరూ.
అంతటితో ఆగకుండా జైన్ ఇన్‌స్టా నుంచి ఫొటోలు, వీడియోలన్నీ బయటికి తీశారు. అందులో మరింత హాట్‌గా కనిపిస్తోంది జైన్. దీంతో ఇన్‌స్టాలో తన ఫాలోవర్లు కూడా పెరిగిపోయారు. సినిమాలో కూడా ఇంతే హాట్‌గా కనిపిస్తే, తన పాత్ర-పెర్ఫామెన్స్ కూడా బాగుంటే తెలుగులో జైన్ బిజీ అయ్యే అవకాశాలున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates