కరోనా వల్ల థియేటర్లు మూతపడ్డ లాక్ డౌన్ కాలంలో చిన్న సినిమాలతో మొదులపెట్టి పెద్ద సినిమాల వరకు చాలానే ఓటీటీల బాట పట్టాయి. తెలుగులో ఆ మార్గంలో రిలీజైన తొలి పెద్ద సినిమా అంటే.. ‘వి’నే. ఈ చిత్రంపై ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. మంచి హైప్ మధ్య అమేజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఆ సినిమా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
ఇంద్రగంటి మోహనకృష్ణ నుంచి వచ్చిన తొలి యాక్షన్ థ్రిల్లర్ ఆయన స్థాయికి ఏమాత్రం తగని విధంగా ఉండటంతో ప్రేక్షకులు నిట్టూర్చేశారు. దీనికి రివ్యూలు బాగా రాలేదు. ప్రేక్షకుల ఫీడ్ బ్యాక్ కూడా బాగా లేదు. ఐతే ఓటీటీ రిలీజ్ కాబట్టి దీని ఫలితాన్ని అంచనా వేయడం కష్టమైంది. ఆ తర్వాత ఈ చిత్రాన్ని టీవీలో ప్రిమియర్‌గా కూడా వేశారు. అక్కడ రేటింగ్ బాగా తక్కువొచ్చింది. ఐతే డిజిటల్లో అందుబాటులో ఉండి, టీవీల్లో కూడా రిలీజైపోయిన ఈ సినిమాను ఇప్పుడు థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.
2021 జనవరి 1న ‘వి’ సినిమా థియేటర్లలో రిలజీ్ కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. నాని కూడా దీని గురించి ట్వీట్ చేశాడు. అమేజాన్ వాళ్లతో ఒప్పందం చేసుకున్నపుడే.. డిజిటల్ రిలీజ్ తర్వాత కొంత విరామానంతరం థియేటర్లలో రిలీజ్ చేసుకుంటామని నిర్మాత దిల్ రాజు హామీ తీసుకున్నాడు. డిజిటల్ రిలీజ్ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి అమేజాన్ వాళ్లకు అభ్యంతరాలు ఉండకపోవచ్చు.
ఐతే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాను ఇంత లేటుగా థియేటర్లలో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఏమాత్రం ఆసక్తి చూపిస్తారన్నదే ప్రశ్న. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు ప్రేక్షకులు రావడం సందేహమే. ఇంతకుముందు పాత సినిమాల్ని ప్రదర్శిస్తే స్పందన అంతంతమాత్రమే. ఇప్పుడు ‘సోలో బ్రతుకే సో బెటర్’కు మంచి స్పందనే వస్తోంది. ఇది రిలీజయ్యాక ‘వి’పై ప్రేక్షకుల చూపు ఉంటుందా అన్నది డౌటే.
This post was last modified on December 25, 2020 12:49 pm
శాండల్ వుడ్ హీరో ఉపేంద్ర ఎంత టిపికల్ గా ఆలోచిస్తారో తొంభై దశకంలో సినిమాలు చూసిన వాళ్లకు బాగా తెలుసు.…
ఏపీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వేగం పెంచింది. ఇటీవల ఉపాధ్యాయ నియామకాలను పూర్తి చేసిన ప్రభుత్వం, ఇప్పుడు…
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…