ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ‘రాధేశ్యామ్’ కంటే దీని తర్వాత చేయబోయే ‘సలార్’ మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ సినిమాను తీయబోయేది ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ డెడ్లీ కాంబినేషన్లో రాబోయేది పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ అనే సంకేతాలు ఫస్ట్ లుక్ చూసినపుడే వచ్చేశాయి. పవర్ ఫుల్ టైటిల్ పెట్టి.. మాంచి పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాడు ప్రశాంత్. ఈ సినిమా జనవరి నెలాఖర్లోనే సెట్స్ మీదికి వెళ్లబోతుండటం విశేషం.
ప్రస్తుతం ‘కేజీఎఫ్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకుంటూనే ‘సలార్’ మీదా వర్క్ చేస్తున్నాడు ప్రశాంత్. నటీనటుల ఎంపిక మీద కసరత్తులు జరుగుతున్నాయి. ఇందులో ఓ కీలక పాత్రకు మోహన్ లాల్‌ను అనుకుంటున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. నిజంగా ప్రభాస్-లాల్ కాంబినేషన్ ఓకే అయితే అంతకంటే ఎగ్జైటింగ్ న్యూస్ ఇంకోటి ఉండదు.
కాగా ఇప్పుడు ‘సలార్’ కథానాయిక విషయంలోనూ ఒక ఆసక్తికర సమాచారం బయటికి వచ్చింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పఠాని ఈ చిత్రంలో ప్రభాస్‌తో జోడీ కట్టనుందట. కెరీర్ ఆరంభంలో చిన్న సినిమాలే చేసింది కానీ.. ఆ తర్వాత దిశ రేంజ్ మారిపోయింది. బాలీవుడ్లో ఇప్పుడు హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్ దిశానే. ఆమె ఫిగర్ ముందు చాలామంది హీరోయిన్లు వెలవెలబోతారు. సినిమాల్ని మించి తన ఫొటో షూట్లతో సోషల్ మీడియాలో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకుంది దిశా.
తెలుగులో ఆమె ‘లోఫర్’ అనే ఒక్క సినిమా మాత్రమే చేసింది. అది సరిగా ఆడకపోవడంతో బాలీవుడ్‌కు పరిమితం అయింది. కానీ ఆమెకు దక్షిణాదిన ఫాలోయింగ్ ఏమీ తక్కువగా లేదు. ఉత్తరాదిన ఎలాగూ పాపులరే కాబట్టి ప్రభాస్ పక్కన జోడీ కట్టిస్తే సినిమాకు కలిసొస్తుందని ప్రశాంత్ భావిస్తున్నాడట. బాలీవుడ్ మీడియాలోనూ ‘సలార్’ కథానాయిక దిశానే అని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ ప్రచారాన్ని కొట్టిపారేయలేం.
This post was last modified on December 24, 2020 3:45 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…