Movie News

ప్రభాస్‌తో డీపీ మార్పించారుగా…

ప్రభాస్ సోషల్ మీడియాలో కనిపించేదే చాలా తక్కువ. ఇక అందులోనూ చాలా అరుదుగా పర్సనల్ ప్రొఫైల్ మార్పులు కనిపిస్తుంటాయి. దాదాపు ఏడేళ్లుగా ఆయన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డీపీలో బాహుబలి లుక్ మాత్రమే దర్శనమిస్తూ ఉండేది. సినిమా రిలీజ్‌లు ఎన్ని ఉన్నా ఆ పాత ఫోటోను మార్చే ప్రయత్నం చేయలేదు. కానీ ఇన్నాళ్ల తర్వాత మొదటిసారిగా ఆ స్థానంలో కొత్త డీపీ చేరింది. హను రాఘవపూడి ప్రాజెక్ట్ ఫౌజీ లుక్‌ను ప్రభాస్ తన కొత్త డీపీగా సెట్ చేసుకున్నాడు.

గత కొన్నేళ్లలో ప్రభాస్ నటించిన ఎన్నో పాన్ ఇండియా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. సలార్, కల్కి 2898 ఏడీ, ది రాజా సాబ్ లాంటి భారీ సినిమాలు రిలీజ్ అయిన సమయంలో కూడా పాత డీపీ అలాగే కొనసాగింది. ఎలాంటి ప్రమోషనల్ హడావిడిలోనూ డీపీని మార్చే ఆలోచన చేయలేదు. ఇప్పుడు హఠాత్తుగా ఫౌజీ లుక్‌ను పెట్టుకోవడం వల్ల అభిమానుల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల మేకర్స్ రిలీజ్ చేసిన రక్తంతో తడిసిన పోస్టర్ ఇమేజ్‌నే ప్రభాస్ ఈ ప్రొఫైల్ పిక్చర్‌గా సెట్ చేశాడు. ఇతర సినిమాల కంటే ఫౌజీ మీద ప్రభాస్ ఎక్కువ నమ్మకంతో ఉన్నాడనే కామెంట్స్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రభాస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటానికి పెద్దగా ఆసక్తి చూపించడు. జస్ట్ తన సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేయడానికి మాత్రమే ఇన్‌స్టాగ్రామ్ వాడుతుంటాడు. పర్సనల్ పోస్ట్‌లు పెట్టడం లాంటివి తన అకౌంట్లో దాదాపుగా అస్సలు ఉండవు. అలాంటి రిజర్వ్‌డ్ హీరో ఏకంగా ఏడు సంవత్సరాల తర్వాత ప్రొఫైల్ పిక్చర్ మార్చాడు అంటే ఫ్యాన్స్‌కు స్పెషల్‌గా అనిపిస్తోంది.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. బ్రిటిష్ కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఒక బలమైన ఎమోషనల్ కథను దర్శకుడు సిద్ధం చేశాడు. నిర్మాణ సంస్థ ఇప్పటికే ఈ సినిమాను డిసెంబర్ 3న థియేటర్లలోకి తీసుకురావాలని అఫిషియల్‌గా రిలీజ్ డేట్‌ను లాక్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు తగినంత సమయం ఉండేలా మేకర్స్ ఈ షెడ్యూల్స్ చాలా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు.

This post was last modified on August 14, 2026 3:25 pm

Share

Recent Posts

ట్రబుల్ బృందానికి టైమ్ కలిసి వస్తోంది

వచ్చే వారం అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా వచ్చే సెలవు రోజుకి, చెప్పుకోదగ్గ సినిమాలే పోటీకి రెడీ అవుతున్నాయి.…

34 minutes ago

రామాయణ అలసత్వం వల్ల ఎవరికి లాభం

సెప్టెంబర్ అయిపోతోంది. ఇండియాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రచారం చేసుకున్న రామాయణ పార్ట్ 1 విడుదలకు కేవలం నలభై రోజులు…

2 hours ago

వివాదాల డోరతి… మనోళ్లు ఇస్తారా హారతి

తమిళంలో తాజాగా విడుదలైన డోరతి అక్కడ వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. సమాజంలో ఈ మధ్య కాలంలో బాగా చర్చల్లోకి…

4 hours ago

వివేకా హ‌త్య: 40 కోట్ల రూపాయ‌లు ఎవ‌రివి?!

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న, మాజీ మంత్రి వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసు వ్య‌వ‌హారంలో 40 కోట్ల రూపాయలు కీల‌కంగా…

4 hours ago

గణపయ్య ముందు ఖాకీలు కాలు కదిపితే…

వినాయక చవితిని అత్యంత ఘనంగా జరిపే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంటాయి. చవితి వచ్చిందంటే పది రోజుల…

5 hours ago