టాలీవుడ్ నటుడు సునీల్ పరిస్థితి కొన్నేళ్ల నుంచి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. కమెడియన్‌గా మాంచి ఊపుమీదున్న సమయంలో హీరో వేషాలపై మోజు చూపించాడు. మొదట్లో చేసిన ‘అందాల రాముడు’.. ‘మర్యాద రామన్న’ తరహాలో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లే చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ ‘పూల రంగడు’ తర్వాత తనను తాను ఎక్కువ ఊహించుకుని బాడీ మార్చుకున్నాడు. ఫైట్లు.. డ్యాన్సులంటూ అతి చేశాడు. మొత్తంగా తన కామెడీ ఇమేజ్‌ను దెబ్బ తీసుకున్నాడు.
సునీల్ కామెడీ పండటానికి అతడి లుక్.. కామెడీ టైమింగ్ ముఖ్య కారణాలు. అవి రెండూ పోవడంతో అతడిని జనాలు చూసే కోణమే మారిపోయింది. ఈ స్థితిలో ఒక దశ దాటాక హీరోగానే సునీల్ కామెడీ కోసం ప్రయత్నిస్తుంటే చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. అంతకుముందులా నవ్వించడంలో అతను పూర్తిగా ఫెయిలయ్యాడు. దీంతో ఈ మధ్య క్యారెక్టర్, నెగెటివ్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.
కాగా ఇప్పుడు సునీల్ మళ్లీ హీరోగా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అది రీమేక్ మూవీ అట. కన్నడలో విజయవంతమైన బెల్ బాటమ్ సినిమాను సునీల్ హీరోగా రీమేక్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఓ నిర్మాత ఈ సినిమా హక్కులు కొని హీరో, దర్శకుడి కోసం చూస్తున్నారట. హీరో పాత్ర, దాని లుక్ ప్రకారం సునీల్ అయితే ఈ సినిమాకు బాగుంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సునీల్ కూడా ఈ సినిమాలో నటించడం పట్ల ఆసక్తితోనే ఉన్నాడట.
విశేషం ఏంటంటే.. బెల్ బాటమ్ ఇప్పటికే తెలుగులోకి డబ్బింగ్ అయి ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. ఈ వింటేజ్ డిటెక్టివ్ థ్రిల్లర్ కన్నడలో సూపర్ హిట్టవగా.. తెలుగులో చూసిన వాళ్లు కూడా మంచి ఫీడ్ బ్యాకే ఇస్తున్నారు. మరి నిజంగా సునీల్ ఈ సినిమా రీమేక్‌లో నటిస్తాడేమో చూడాలి.
This post was last modified on December 24, 2020 10:06 am
గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…