Movie News

ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ సంపాదిస్తున్న హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్, చిరుత ఫేమ్ నేహా శర్మ సినిమాల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, సోషల్ మీడియా ద్వారా సంపాదనలో మాత్రం దుమ్మురేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ చూడాలనుకునే వారి కోసం నెలకు 290 రూపాయల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ పెట్టింది. ప్రస్తుతం ఆమెకు దాదాపు 2,454 మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అంటే సినిమాలు, వెబ్ సిరీస్‌లతో సంబంధం లేకుండా కేవలం ఇన్‌స్టాగ్రామ్ ద్వారానే ఆమె నెలకు సుమారు 7 లక్షల రూపాయలకు పైగా వెనకేస్తోంది.

ఒక నటిగా కెరీర్ ఇబ్బందుల్లో ఉన్నా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను వాడుకుని ఇలా ఆదాయం పొందడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నేహా శర్మ నేపథ్యం చూస్తే ఆమె బీహార్‌కు చెందిన కాంగ్రెస్ రాజకీయ నాయకుడు అజిత్ శర్మ కుమార్తె. ఇటీవల జరిగిన ఎన్నికల్లో (భాగల్పుర్ నియోజకవర్గం) తండ్రి ఓటమి పాలయ్యారు. బాలీవుడ్‌లో ఒకటి రెండు గుర్తింపు ఉన్న చిత్రాల్లో నటించినా అవేవీ ఆమె కెరీర్‌ను నిలబెట్టలేకపోయాయి.

ఆ తర్వాత ఓటీటీ వైపు అడుగులు వేసి ‘ఇల్లీగల్’ వంటి వెబ్ సిరీస్‌లలో నటించింది. అయితే ఒకటి కంటే ఎక్కువ సీజన్లు వచ్చినా ఆ సిరీస్‌లు ఆమెకు పెద్దగా బ్రేక్ ఇవ్వలేదు.
సినిమాలు ఫ్లాప్ అయినా గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్న వారికి ఆదాయ మార్గాలు మూసుకుపోవని నేహా శర్మ నిరూపిస్తోంది. సాధారణంగా సక్సెస్ ఉన్న హీరోయిన్లకు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, భారీ రెమ్యునరేషన్లు ఉంటాయి.

కానీ వరుస ఫ్లాపులు ఎదుర్కొంటున్న ఒక నటి కూడా కేవలం సోషల్ మీడియా సబ్‌స్క్రిప్షన్లతో ఇంత మొత్తంలో సంపాదిస్తోందంటే, ఇక టాప్ హీరోయిన్ల రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సినిమాల్లో సక్సెస్ రేటు ఎలా ఉన్నా, ఫేమ్ ఉంటే చాలు ఏదో ఒక రకంగా డబ్బు సంపాదించవచ్చనేది అర్ధమవుతుంది. ఈ ఇన్‌స్టాగ్రామ్ ఎక్స్‌క్లూజివ్ ఆఫర్ అనేది కేవలం హీరోయిన్లకు, మహిళా సెలబ్రిటీలకే ఎక్కువగా వర్కవుట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హీరోలు లేదా మగ సెలబ్రిటీలు ఇలాంటి ప్లాన్లు పెట్టినా సబ్‌స్క్రైబర్లు వచ్చే అవకాశం తక్కువ. కేవలం గ్లామర్ కంటెంట్‌ను మాత్రమే నమ్ముకుని ఇలాంటి సబ్‌స్క్రిప్షన్ మోడల్స్ నడుస్తుంటాయి. నేహా శర్మ తన సినిమాల కంటే తన ఫొటో షూట్స్, జిమ్ వీడియోల ద్వారానే ఎక్కువ మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇప్పుడు అదే క్రేజ్‌ను ఆదాయంగా మార్చుకుంటోంది.

This post was last modified on March 24, 2026 3:07 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

3 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

5 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

5 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

6 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

7 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

9 hours ago