ప్రస్తుతం సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో అనిరుధ్ రవిచందర్ మ్యూజికల్ కన్సర్ట్ అంటే చాలు… యూత్ విరగబడి వచ్చేస్తారు. ఎంత రేటు పెట్టినా అదేం పెద్ద విషయం కాదన్నట్లు ఎగబడతారు. తన సంగీత విభావరుల్లో ఉండే ఊపే వేరు. తాజాగా అనిరుధ్.. హైదరాబాదీ సంగీత ప్రియుల కోసం కన్సర్ట్ నిర్వహించాడు.
శనివారం జరిగిన ఈ ఈవెంట్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఆ ఈవెంట్‌కు వెళ్లిన వాళ్లను ఆ అనుభూతి గురించి అడిగితే మాటలు లేవంటున్నారు. ఈ కన్సర్ట్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ట్రేడ్ మార్క్ పాటలతో అనిరుధ్ హోరెత్తించేశాడు ఈ ఈవెంట్లో. ఐతే మిగతా పాటలన్నీ ఒకెత్తయితే.. నేచురల్ స్టార్ నాని సినిమా ది ప్యారడైజ్ నుంచి అనిరుధ్ పెర్ఫామ్ చేసిన ఆయా షేర్ పాట మరో ఎత్తు.
పెద్ద పెద్ద స్టార్ల పాటలను మించి ఈ సాంగ్‌కు వచ్చిన రెస్పాన్స్ అసామాన్యం అని చెప్పొచ్చు. మొత్తం ఈవెంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పాట వచ్చినపుడు ఊగిపోయారు. కోరస్ కలుపుతూ పాట పాడడమే కాక.. స్టెప్పులేస్తూ మొత్తం ఆ ప్రాంగణాన్ని షేక్ చేసేశారు. ఈ ఉత్సాహం చూశాక అనిరుధ్‌లో జోష్ ఇంకా పెరిగింది. అభిమానులను ఉత్సాహపరుస్తూ.. అదిరిపోయే రేంజిలో పెర్ఫామ్ చేశాడు అనిరుధ్. బహుశా అనిరుధ్ తన సొంతగడ్డ అయిన తమిళనాడులో కూడా ఇలాంటి రెస్పాన్స్ చూసి ఉండకపోవచ్చు.
ఆ స్థాయిలో ఆ పాట కన్సర్ట్‌కు హైలైట్‌గా నిలిచింది. సంబంధిత వీడియోలు చూసిన నెటిజన్లు.. ఇలాంటి వాతావరణం ఉంటుందంటే ఎంత రేటు పెట్టినా అయినా మ్యూజికల్ కన్సర్ట్‌లకు వెళ్లొచ్చు అని కామెంట్లు చేస్తున్నారు. ఆయా షేర్ పాట రిలీజైనపుడు ఒక వారం పాటు సోషల్ మీడియా ఊగిపోయింది. ఇప్పుడీ రెస్పాన్స్ చూస్తుంటే.. థియేటర్లలో ఈ పాటకు వచ్చే రెస్పాన్స్ కూడా వేరే లెవెల్లో ఉంటుందని స్పష్టమవుతోంది.
This post was last modified on March 22, 2026 8:23 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…