Movie News

దురంధర్ ధాటిని ఉస్తాద్ తట్టుకున్నాడా?

దురంధ‌ర్‌-2 సినిమా ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇండియ‌న్ సినిమాలు ఆడే ప్ర‌తి చోటా ప్ర‌భంజ‌నం సృష్టిస్తోంది. ఇండియా సంగ‌తైతే చెప్పాల్సిన ప‌ని లేదు. హిందీ చిత్రాలు సాధార‌ణంగా ద‌క్షిణాదిన మ‌రీ ఎక్కువ వ‌సూళ్లు రాబ‌ట్ట‌లేవు. పెద్ద సిటీల్లో త‌ప్పితే.. ప్ర‌భావం ఉండ‌దు. కానీ దురంధ‌ర్-2 అలా కాదు.. సౌత్ ఇండియాలో కూడా వ‌సూళ్ల మోత మోగిస్తోంది. తొలి

రెండు రోజులు ఈ చిత్రం ప్రాంతీయ భాష‌ల్లో రిలీజ్ కాలేదు. అయినా హిందీ వెర్ష‌న్‌ను ఎగ‌బ‌డి చూశారు. నాలుగ్గంట‌ల సినిమా అయినా జ‌నాలకు అదేమీ ఇబ్బందిగా అనిపించ‌డం లేదు. ఇక శ‌నివారం మ‌ధ్యాహ్నం త‌ర్వాత దురంధ‌ర్-2 తెలుగు, త‌మిళ వెర్ష‌న్లు అందుబాటులోకి రావ‌డంతో స్పంద‌న మామూలుగా లేదు.

ఇలాంటి ప్ర‌భంజనం సృష్టిస్తున్న సినిమాను త‌ట్టుకుని మ‌రో చిత్రం నిల‌బ‌డడం అంత తేలిక కాదు. అందులోనూ డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమాకైతే మ‌రీ క‌ష్టం. కానీ అక్క‌డున్న‌ది ప‌వ‌ర్ స్టార్ ప‌వన్ క‌ళ్యాణ్ సినిమా. అది ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ‌లంగానే నిల‌బ‌డుతోంది.

తొలి రోజుతో పోలిస్తే శుక్ర‌వారం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ వ‌సూళ్లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. కానీ శ‌నివారం ఈ చిత్రం పుంజుకుంది. రంజాన్ సెల‌వు కావ‌డం, వీకెండ్ కూడా అవ్వ‌డంతో మ్యాట్నీల నుంచి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ఊపు పెరిగింది. ఈవెనింగ్, నైట్ షోల‌కు అయితే స్పంద‌న బాగుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద సిటీల్లో చాలా షోలు సోల్డ్ ఔట్ అయిపోయాయి. మిగ‌తా షోల‌న్నీ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్‌లోనే క‌నిపించాయి.

దురంధ‌ర్‌తో పోలిస్తే స్వ‌ల్పంగా ఉస్తాద్‌కు షోలు ఎక్కువ ఇచ్చారు. అయినా మెజారిటీ షోల‌కు ఆక్యుపెన్సీలు చాలా బాగున్నాయి. తెలుగు రాష్ట్రాల అవ‌త‌ల అంటే క‌ర్ణాట‌క‌లో మాత్ర‌మే సినిమా బ‌లంగా నిల‌బ‌డుతోంది. మిగ‌తా చోట్ల దురంధ‌ర్‌-2 ప్ర‌భంజ‌నాన్ని త‌ట్టుకోవ‌డం క‌ష్టంగానే ఉంది.

యుఎస్‌లో కూడా ఈ హిందీ మూవీ ప్ర‌భావం ఉస్తాద్ మీద గ‌ట్టిగానే ఉంది. అక్క‌డ వ‌సూళ్లు ప‌వ‌న్ స్టామినాకు త‌గ్గ‌ట్లుగా లేవు. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప‌వ‌న్ సినిమా డివైడ్ టాక్‌ను, దురంధ‌ర్-2 పోటీని త‌ట్టుకుని గ‌ట్టిగానే నిల‌బ‌డుతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి.

This post was last modified on March 22, 2026 7:52 am

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

1 hour ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago