మెగా-మంచు కుటుంబాల మధ్య మధ్యలో కొన్నేళ్లు మినహాయిస్తే మంచి సంబంధాలే ఉన్నాయి. టాలీవుడ్ వజ్రోత్సవ వేడుకలో, ఆ తర్వాత చిరంజీవికి పద్మభూషణ్ పురస్కారం దక్కినపుడు జరిగిన ఓ వేడుకలో తలెత్తిన విభేదాల వల్ల కొంత అంతరం వచ్చింది కానీ.. కొన్నేళ్ల తర్వాత పరిస్థితులు సర్దుకున్నాయి.
చిరు, మోహన్ బాబు అప్పట్నుంచి చాలా సన్నిహితంగానే మెలుగుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఓ కార్యక్రమంలో చిరు, మోహన్ బాబుల సాన్నిహిత్యమే హాట్ టాపిక్ అయింది. ఇప్పుడీ ప్రస్తావనంతా ఎందుకు అంటే.. తాజాగా చిరంజీవిని మంచు విష్ణు వెళ్లి ప్రత్యేకంగా కలుసుకున్నాడు. ఆయనతో కలిసి ఉన్న ఫొటోను కూడా ట్విట్టర్లో షేర్ చేశాడు. దానికి అతను జోడించిన వ్యాఖ్యను బట్టి చూస్తే ఈ కలయికలో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే కనిపిస్తోంది.
ఈ రోజు బిగ్ బాస్ చిరంజీవి అంకుల్‌ను కలిశా. ఆయన్నెందుకు కలిశానో త్వరలోనే వెల్లడిస్తా. ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించే అవకాశం దక్కింది. చాలా విషయాలు నేర్చుకున్నా. ఆయన మెగాస్టార్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు అని వ్యాఖ్యానించాడు విష్ణు. మరి ఇప్పుడు విష్ణు వ్యక్తిగతంగా వెళ్లి చిరును ఎందుకు కలిశాడు.. త్వరలో అతనేం చెప్పబోతున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది.
తన కొత్త చిత్రం మోసగాళ్లు సినిమా టీజర్, ట్రైలర్ లాంటివి ఆయనతో లాంచ్ చేయించబోతున్నాడా.. ప్రి రిలీజ్ ఈవెంట్ కోసం ఆయన్నేమైనా ఆహ్వానించాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. దీనికోసమే అయితే చిరును వ్యక్తిగతంగా కలవాల్సిన అవసరముందా అన్నది డౌట్. మరి చిరు భాగస్వామ్యంతో ఇంకేదైనా విష్ణు చేయబోతున్నాడా అన్నది ఆసక్తికరం.
This post was last modified on December 23, 2020 1:36 pm
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…