మెగాస్టార్ చిరంజీవి వరుసగా రెండు రీమేక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో మొదటిది మలయాళ బ్లాక్‌బస్టర్ లూసిఫర్ ఆధారంగా తెరకెక్కనున్న సినిమా. ఇటీవలే ఈ చిత్రానికి తెలుగువాడైన తమిళ దర్శకుడు మోహన్ రాజాను దర్శకుడిగా ఖరారు చేశారు. ఇంతకుముందు సుజీత్, వి.వి.వినాయక్ ఈ ప్రాజెక్టు మీద పని చేశారు. కానీ వాళ్లిద్దరూ చిరు కోరుకున్నట్లుగా స్క్రిప్టు తయారు చేయలేకపోయారు.
రీమేక్‌లు తీయడంలో మంచి నైపుణ్యం ఉండి, అలాగే ఒరిజినల్ సినిమాల్లోనూ తనదైన ముద్ర చూపించిన మోహన్ రాజా.. చిరును తన స్క్రిప్టుతో మెప్పించగలిగాడు. ఒరిజినల్‌తో పోలిస్తే ఇంకొంచెం వినోదాత్మకంగా, కమర్షియల్ అంశాల కలబోతతో సినిమా ఉండాలని చిరు కోరుకున్నారు. రాజా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేశారు.
చిరు సినిమా అన్నాక కథానాయిక లేకుంటే చాలా కష్టం. లూసిఫర్‌లో మోహన్ లాల్‌కు జోడీ ఉండదు. తెలుగులో ఆ పాత్రను అలాగే చూపిస్తే సరిపోదని.. హీరోయిన్, రెండు మూడు పాటలు లేకుండా తన అభిమానులు ఒప్పుకోరని చిరు బలమైన అభిప్రాయంతో ఉన్నారట. రాజా ఆ మేరకు కొత్త ఎపిసోడ్ జోడించి హీరోయిన్ పాత్రకు స్కోప్ ఇచ్చారట.
ఈ పాత్ర కోసం సరైన హీరోయిన్ని ఎంచుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం ఇలియానా పేరు కూడా వినిపిస్తుండటం విశేషం. చిరు వయసు సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం చాలా కష్టమైపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలియానా వైపు చూస్తున్నారట. హీరోయిన్ ఎపిసోడ్‌తో పాటు కొన్ని కామెడీ, యాక్షన్ ఎపిసోడ్లను కూడా రీమేక్‌లో చేరుస్తున్నట్లు సమాచారం.
This post was last modified on December 23, 2020 9:14 am
నిన్న విడుదలైన ఉపేంద్ర యుఐకి విచిత్రమైన టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో ఇంటెలిజెంట్ మేకింగ్, అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత…
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…