ఎన్నో సందేహాల మధ్య దక్షిణాదిన అడుగు పెట్టిన రెండు చోట్లా మంచి ఆదరణే సంపాదించుకుంటోంది ‘బిగ్ బాస్’ షో. కొందరు ఈ షో అంతా ట్రాష్ అని కొట్టి పారేసినా.. దీన్ని వీర లెవెల్లో ఫాలో అయ్యే వ్యూయర్స్ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ‘బిగ్ బాస్’ణు వ్యతిరేకించే వారి ప్రధాన అభ్యంతరం.. ఈ షో అంతా స్క్రిప్టెడ్ అనేదే. జనాలు అనుకున్నంత ఫెయిర్‌గా షో నడవదన్నది వారి మాట. పలు సందర్భాల్లో ప్రేక్షకుల అభిప్రాయాలకు భిన్నంగా ఎలిమినేషన్లు జరగడం ఇందుకు ఓ సూచిక. ఇక మొన్నటి గ్రాండ్ ఫినాలె విషయంలో జరిగిన ఉదంతాలు అనేక సందేహాలకు తావిచ్చాయి.
టైటిల్ రేసులో ఉంటావా.. మూడో స్థానంతో సంతృప్తి చెంది రూ.25 లక్షల డబ్బుతో నిష్క్రమిస్తావా అని సోహైల్‌ను అడిగితే.. అతను రేసు నుంచి తప్పుకుని డబ్బు తీసుకుని వెళ్లిపోవడానికే సిద్ధపడటం చాలామందిని ఆశ్చర్యపరిచింది. ఇప్పటిదాకా వివిధ భాషల్లో ‘బిగ్ బాస్’ షోలో అలా ఎప్పుడూ జరిగింది లేదు. కానీ సోహైల్ మాత్రం ఈ రూటునే ఎంచుకున్నాడు. తాను విజేతగా నిలిచే అవకాశాలు లేవని హింట్ అందిన నేపథ్యంలోనే సోహైల్ ఇలా చేశాడనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఫినాలెకు ముందు హౌస్ నుంచి నిష్క్రమించిన కంటెస్టెంట్లందరూ టాప్-5ను కలిసే అవకాశం ఇచ్చినపుడు సోహైల్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మెహబూబ్ అతడికి ఓటింగ్ ట్రెండ్స్ గురించి చెప్పినట్లుగా కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. ‘బిగ్ బాస్’ ఫైనల్ అందరూ అనుకున్నట్లు పూర్తిగా లైవ్ కాదని.. దీన్ని రెండు రోజుల పాటు చిత్రీకరించారని ఒక ప్రచారం నడుస్తోంది. ఫైనల్ ఎపిసోడ్‌లో ఒక చోట సోహైల్ తొందరపాటులో.. ‘‘నిన్న నేను పది లక్షలు ఇచ్చినపుడు..’ అని వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనం. అలాగే అతను పది లక్షలు అనాథాశ్రమానికి విరాళం ప్రకటించడం.. తర్వాత నాగ్ అతడి తరఫున పది లక్షలు తాను ఇస్తాననడం.. ఆపై చిరంజీవి తన వంతుగా రూ.10 లక్షలు ప్రకటించడం ఇదంతా స్క్రిప్టే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముందు చిరుకు ఈ విషయం ఏమీ తెలియనట్లుగా నాగ్ వివరించగా.. మధ్యలో చిరు ఒక చోట తనకీ విషయం ముందే తెలుసు అన్నట్లుగా ఒక మాట అనడం.. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తే స్క్రిప్టు ప్రకారమే అన్నీ జరిగాయనిపిస్తుంది.
This post was last modified on December 22, 2020 9:08 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…