సింగర్ సునీత రెండో పెళ్లి ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. కొన్ని రోజుల కిందటే నిశ్చితార్థం చేసుకుని తాను మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది సునీత. భర్త నుంచి చాలా ఏళ్ల కిందటే విడిపోయిన సునీత.. తన కష్టంతో పిల్లలిద్దరినీ పెంచి పెద్ద చేశారు. వాళ్లిద్దరూ యుక్త వయసులో ఉండగా.. వారి అంగీకారంతో, కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. రామ్ అనే మీడియా వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరి పెళ్లి జరగనుండగా.. దానికి ముందు ప్రి వెడ్డింగ్ పార్టీని గ్రాండ్‌గా నిర్వహించింది రామ్-సునీత జంట. ఈ వేడుకను హీరో నితిన్ తన చేతుల మీదుగా నిర్వహించడం విశేషం. ఈ బాధ్యత నితిన్ తీసుకోవడం ఏంటి అని ఆశ్చర్యం కలగొచ్చు. ఐతే సునీతకు కాబోయే భర్త రామ్ నితిన్‌కు బాగా క్లోజ్ అట. అందుకే నితిన్ ఈ పార్టీని ఏర్పాటు చేశాడట.
జూబ్లీ హిల్స్‌లోని ఓ హోటల్లో జరిగిన ఈ పార్టీలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పాల్గొనడం విశేషం. సునీతతో ఆమెకు మంచి అనుబంధం ఉందట. మొదటి పెళ్లి విఫలమైనప్పటికీ.. ఒక తోడుండగాలని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని రేణు బలంగా చెబుతుంటుంది. తన పిల్లల అంగీకారంతో ఆమె కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. రెండేళ్ల కిందట నిశ్చితార్థం కూడా చేసుకుంది. ఆ తర్వాత పెళ్లి గురించి ఏ అప్ డేట్ ఇవ్వలేదు. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని దాని గురించి గోప్యంగా ఉంచుతోందా.. లేక పెళ్లి చేసుకోలేదా అన్నది జనాలకు తెలియడం లేదు. ఆ సంగతలా ఉంచితే సునీత ప్రి వెడ్డింగ్ పార్టీలో యాంకర్ సుమతో పాటు టాలీవుడ్ సింగర్లు కూడా కొందరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కొన్ని ఫొటోలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి చాలా సింపుల్‌గా చేసుకోవాలని సునీత, రామ్ భావిస్తున్నారట. అందుకే దానికి ముందు ప్రి వెడ్డింగ్ పార్టీ గ్రాండ్‌గా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
This post was last modified on December 22, 2020 9:07 pm
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…