సక్సెస్ఫుల్ దర్శకులలో ఒకడైన ఆ యంగ్ డైరెక్టర్ ఒక యువ హీరోయిన్ని ఏరి కోరి తన సినిమాల్లో పెట్టుకుంటున్నాడనే గుసగుసలు ఫిలింనగర్లో బాగా వినిపిస్తున్నాయి. సదరు హీరోయిన్ ఫ్లాపులలో వున్నా, ఆమెకంటూ ప్రత్యేకించి నటన పరంగా టాలెంట్ లేకపోయినా, డాన్సులు గట్రా రాకపోయినా కానీ ఆ హీరోయిన్ పట్ల ఆ దర్శకుడికి వున్న ఆకర్షణే ఆమెకు అవకాశాలు తెస్తోందనే పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ హీరోయిన్‌కి మిగతా ఎవరూ ఇప్పుడు అవకాశాలు ఇవ్వడం లేదు.
ఆమె వరుస ఫ్లాప్స్ ఇవ్వడంతో పాటు నటిగా ఎలాంటి పరిణితి చూపించకపోవడంతో టాలీవుడ్ ఆమెను ఎంకరేజ్ చేయడం లేదు. కానీ సక్సెస్ఫుల్ డైరెక్టర్‌కి ఆమె పట్ల అభిమానం వుండడంతో తనకు ఢోకా వుండడం లేదు. ఆమెకు నిర్మాత ఎక్కువ పారితోషికం ఇవ్వడానికి ఇష్టపడడం లేదు.
కాబట్టి నిర్మాత ఇచ్చిన దానికి డబుల్ తన పారితోషికంలోంచి ఆమెకు ఇస్తున్నాడని కూడా చెవులు కొరుక్కుంటున్నారు. కొందరు దర్శకులు కొందరు హీరోయిన్లను రిపీట్ చేయడం సర్వ సాధారణమే. మరి ఇది కూడా అలా చేయడం వల్ల పుట్టుకొచ్చిన రూమరా లేక నిజంగానే నిప్పు రాజుకోవడం వల్ల వచ్చిన పొగంటారా?
Gulte Telugu Telugu Political and Movie News Updates