ఈ సమ్మర్ తెలుగు రిలీజుల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘డెకాయిట్’ ఒకటి. ఇది భారీ చిత్రమేమీ కాకపోయినా.. పెద్ద స్టార్లు లేకపోయినా.. దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. అందుకు ప్రధాన కారణం అది అడివి శేష్ మూవీ కావడమే. ‘క్షణం’ దగ్గర్నుంచి తాను చేసే ప్రతి సినిమాలో బాగా ఇన్వాల్వ్ అవుతూ.. శేష్ సినిమా అంటే బలమైన కంటెంట్ ఉంటుంది అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించాడీ యంగ్ యాక్టర్ కమ్ రైటర్.
‘డెకాయిట్’ రైటింగ్‌లోనూ అతడికి భాగం ఉంది. రచన దగ్గర్నుంచి మేకింగ్ వరకు చాలా టైం తీసుకుని, జాగ్రత్తగా పని చేస్తుంది శేష్ అండ్ టీం. ‘గూఢచారి’ సినిమాటోగ్రాఫర్ షనీల్ డియో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శేష్‌కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించడం ఈ సినిమాకు మరో ఆకర్షణ. అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో సుప్రియ నిర్మించిన ఈ చిత్రం షూట్ పూర్తి చేసుకుంది. ఏప్రిల్ 10కి రిలీజ్ అనుకుంటున్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో శేష్.. ‘డెకాయిట్’ కథేంటో చెప్పేశాడు. ప్రేమలో పడి.. ఇగో క్లాష్ వల్ల విడిపోయిన జంట.. ఆపై ఒక క్రైసిస్‌లో భాగంగా కలిసినపుడు వారి మధ్య జరిగే సంఘటనల సమాహారమే ఈ సినిమా అని శేష్ చెప్పాడు. ఐతే ప్రేమకథ ఎక్కువ సేపు ఉండదని.. వాళ్లు ఎలా విడిపోయారు అన్నది ఐదు నిమిషాల్లో చూపిస్తామని చెప్పాడు.
వర్తమానంలో ఫుల్ యాక్షన్ మోడ్‌లో సినిమా నడుస్తుందని చెప్పాడు. తుపాకులు, బాంబుల మోత మధ్య ఒక క్రైసిస్‌ను ఎదుర్కొనే క్రమంలో ఈ జంట ఏం రియలైజ్ అయింది అన్న నేపథ్యంలో కథ నడుస్తుందని.. యాక్షన్, ఎమోషన్లు సినిమాలో హైలైట్‌గా ఉంటాయని శేష్ చెప్పాడు. ఈ సినిమాకు కథ రాయడానికి ఏడాది సమయం పట్టిందని.. షూట్ కోసం 150 దాకా వర్కింగ్ డేస్ అయ్యాయని శేష్ వెల్లడించాడు.
అయితే విడుదలకు ముందే ఇలా కథ మొత్తం చెప్పేస్తే స్క్రీన్ పై చూసినప్పుడు ఆసక్తి ఉండదేమో అంటూ కొందరు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కథ తెలిసిన అబ్బురపరిచే ట్విస్టులను దృష్టిలో పెట్టుకొనే శేష్ ఇలా చెప్పి ఉంటాడని ఇండస్ట్రీ వర్గాల చర్చ.
This post was last modified on March 12, 2026 3:29 pm
ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…
ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…
టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…
గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…
ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…
రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…