‘ద్రోణ’ బికినీ రచ్చపై స్పందించిన ప్రియమణి

ఇప్పుడు పూర్తిగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తోంది ప్రియమణి. కెరీర్ ఆరంభంలోనూ ఆమె సంప్రదాయ పాత్రలే చేసింది. అలాంటి అమ్మాయి.. మధ్యలో గ్లామర్ రోల్స్‌లో మామూలుగా రెచ్చిపోలేదు. ముఖ్యంగా నితిన్ హీరోగా తెరకెక్కిన ‘ద్రోణ’ అనే చిత్రంలో చేసిన బికినీ షో అప్పట్లో ఒక సంచలనం. అప్పటిదాకా ప్రియమణికి ఉన్న ఇమేజ్ వేరు. కానీ ఆ సినిమాలో బికినీలో వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ చేయడం చూసి కుర్రకారుకు మతులుపోయాయి.

కొన్నేళ్ల పాటు ఇంటర్నెట్లో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఇప్పటికీ అప్పుడప్పుడూ ప్రియమణి బికినీ ఫొటోలు సోషల్ మీడియాలో తిరుగుతుంటాయి. ప్రియమణి ఇలా బికినీ వేసినపుడు.. ఫ్యామిలీ హీరోయిన్‌గా గుర్తింపు ఉన్న అమ్మాయి ఇలా చేసిందేంటి అంటూ పెద్ద చర్చే జరిగింది. ఐతే దాని గురించి ఎప్పుడూ స్పందించని ప్రియమణి.. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో ఆ టాపిక్ గురించి మాట్లాడింది.

వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎస్.సరస్వతి’ చిత్రంలో ప్రియమణి ఓ కీలక పాత్ర చేసింది. ఈ సందర్భంగా వరలక్ష్మితో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో ‘ద్రోణ’ బికినీ రచ్చ గురించి ప్రియమణి మాట్లాడుతూ..

‘‘నేను అప్పటిదాకా అలాంటి లుక్‌లో కనిపించలేదు. దర్శకుడు బికినీ వేసుకోమని.. ఒక బాలీవుడ్ మూవీలో కరీనా కపూర్ తరహాలో చూపిస్తానని అన్నాడు. అది డైరెక్టర్ ఛాయిస్. తన మాట నేను వినాలి. ఎప్పుడూ ఒకేలా ఎందుకు ఉండాలి.. ఒక నటిగా ఇది కూడా ట్రై చేయాలి కదా అనిపించింది. విదేశాలకు వెళ్తే.. బీచుల్లో, స్విమ్మింగ్‌పూల్స్‌లో అమ్మాయిలందరూ బికినీలు, స్విమ్ సూట్లలోనే కనిపిస్తారు.

సినిమాలో కూడా స్విమ్మింగ్ పూల్ సీన్ అంటే చీరలో కనిపించలేం కదా. అందుకే ఆ డ్రెస్ వేసుకోవడానికి ఒప్పుకున్నా. అప్పుడు దాని మీద పెద్ద డిస్కషన్ జరిగింది. అప్పుడు దర్శకుడు ఆ డ్రెస్ వేసుకోమన్నపుడు ఎక్కువ ఆలోచించలేదు. కానీ ఇప్పుడున్న మైండ్ సెట్‌లో ఆ డ్రెస్ వేసుకోమంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తానేమో’’ అని ప్రియమణి వెల్లడించింది. రాజమౌళి శిష్యుడైన కరుణ్ కుమార్ అనే దర్శకుడు రూపొందించిన ‘ద్రోణ’ పెద్ద డిజాస్టర్ అయినప్పటికీ.. ప్రియమణికి మాత్రం ఆ మూవీ మంచి పాపులారిటీనే తెచ్చిపెట్టింది.