బేసిగ్గా ఫిలిం బ్యాగ్రౌండ్ లేకపోయినా సరే.. సినీ కుటుంబాల్లోకి అల్లుళ్లుగా వెళ్తే హీరోలు అయిపోవచ్చు. తెలుగులో సుధీర్ బాబుతో పాటు కళ్యాణ్ దేవ్ సైతం ఇలాగే హీరోలయ్యారు. కెరీర్ ఆరంభంలో సుధీర్ ఇబ్బంది పడ్డప్పటికీ ఇప్పుడు బాగానే నిలదొక్కుకున్నాడు. కళ్యాణ్ దేవ్‌కు తొలి సినిమా చేదు అనుభవాన్ని మిగిల్చింది. రెండో సినిమా సంగతేంటో చూడాలి.
టాలీవుడ్ సంగతిలా ఉంటే.. బాలీవుడ్లో ఇలాగే ఓ పెద్ద కుటుంబంలోకి అల్లుడిగా వెళ్లిన కుర్రాడు హీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగులవుతున్నాడు. అతనే.. ఆయుష్ శర్మ. ఇతను కొన్నేళ్ల కిందట సల్మాన్ సోదరి అర్పితను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అర్పిత సల్మాన్ సొంత చెల్లెలేమీ కాదు. అనాథ అయిన ఆమెను చిన్నపుడు దత్తత తీసుకుని సల్మాన్ తల్లిదండ్రులు సొంత బిడ్డ లాగే చూసుకున్నారు. సల్మాన్‌కు కూడా ఆ అమ్మాయంటే చాలా ఇష్టం.
పొలిటికల్‌గా మంచి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఆయుష్.. సల్మాన్ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం ఆలస్యం సినీ రంగ ప్రవేశం చేశాడు. కానీ హీరోగా అతను నటించిన సినిమాలు అంత మంచి ఫలితాన్నివ్వలేదు. ఇంకా సక్సెస్ అందుకోని అతను.. ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో కలిసి నటిస్తుండటం విశేషం. ఆ సినిమా పేరు.. ‘యాంటిమ్’. బాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నటుడు కూడా అయిన మహేష్ మంజ్రేకర్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. సల్మాన్ స్వయంగా నిర్మిస్తూ లీడ్ రోల్ చేస్తున్నాడు.
ఇందులో సల్మాన్‌కు పోటా పోటీగా ఉండే పాత్రను ఆయుష్ చేస్తున్నాడు. అది విలన్ పాత్రా.. మరో హీరో పాత్రా అన్నది తెలియదు. ఈ చిత్రం కోసం విపరీతంగా కండలు పెంచి సరికొత్తగా తయారయ్యాడతను. తాజాగా ఆ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ లాంటిది రిలీజ్ చేశారు. అందులో ఆయుష్ సిక్స్ ప్యాక్ బేర్ బాడీతో పరిగెత్తుకుని వచ్చి సల్మాన్‌ను ఢీకొట్టడం కనిపించింది. సల్మాన్ సినిమాలో కీలక పాత్ర, పైగా ఆయన్ని ఢీకొట్టే క్యారెక్టర్ అంటే ఆయుష్‌కు మంచి గుర్తింపే వస్తుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమాను సల్మాన్ బామ్మర్దిని ఏమేర నిలబెడతాడో చూడాలి.
This post was last modified on December 21, 2020 5:57 pm
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…