థియేటర్లకు జనం రారనే భయంతో నిర్మాతలంతా సినిమాలు విడుదల చేయకుండా దాచి పెట్టుకుంటే సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను థియేటర్లలో వదులుతున్నారు. క్రిస్మస్ రోజున ఈ చిత్రం థియేటర్లలో రానుంది. ఈ చిత్రానికి నిర్మాత రిస్క్ అయ్యేదేమీ లేదు… ఎందుకంటే జీ5 భారీ మొత్తానికి రైట్స్ అన్నీ కొనేసుకుంది. వారి నుంచి థియేటర్స్ రైట్స్ని దిల్ రాజు, యువి వాళ్లు తీసుకున్నారు. వారు చేసిన రిస్క్ ఎంతవరకు పే చేస్తుందనేదే ఇప్పుడంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఆడియన్స్ రావడం, రాకపోవడం మాట అటుంచితే, ఈ చిత్రాన్ని సోలోగా రిలీజ్ చేయడం వల్ల అందుబాటులో వున్న థియేటర్లన్నీ ఈ చిత్రానికే దక్కుతున్నాయి. మామూలుగా బడా హీరోలకు తప్ప దొరకని బెస్ట్ థియేటర్లు ఈ చిత్రం ప్రదర్శించబోతున్నాయి. అలా సాయి ధరమ్ తేజ్ సినిమాకి ఈ సోలో రిలీజ్ చాలా ప్లస్ అవనుంది. సినిమా ఎలాగుందీ, సోమవారం తర్వాత నిలబడుతుందా అనేది రిలీజ్ అయితే తెలుస్తాయి కానీ మొదటి వారాంతం వరకు ఢోకా వుండదనే అనిపిస్తోంది. అఫ్‍కోర్స్ డిజాస్టర్ టాక్ వస్తే ఎవరూ ఏమీ చేయలేరనుకోండి. అది వేరే సంగతి. కానీ ట్రెయిలర్ చూస్తే మాత్రం మినిమం గ్యారెంటీ సినిమా అనే అనిపిస్తోంది.
This post was last modified on December 20, 2020 12:32 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…