Movie News

లవ్ ‘స్టోరీ’తో షాక్ ఇచ్చిన అల్లు అర్జున్

​ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేవలం వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్ అని తెలిసిందే. తన భార్య స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న బన్నీ, అప్పుడప్పుడు ప్రేమకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. నేడు వాలెంటైన్స్ డే సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన కొన్ని వీడియోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

​ఈ వీడియోలలో ముఖ్యంగా ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు సాయిలు కంపాటి చెప్పిన మాటలను బన్నీ హైలెట్ చేయడం విశేషం. ఒక మధ్యతరగతి అబ్బాయి జీవితంలో తోడుగా ఉండే అమ్మాయి గురించి గతంలో అతను చెప్పిన మాటలు చాలా ఎమోషనల్‌గా ఉన్నాయి. “మన దగ్గర డబ్బులు లేకపోయినా, పండగకి బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నా.. నేను ఉన్నాను అని భరోసా ఇచ్చే అమ్మాయి దొరకడం నిజంగా అదృష్టం” అని ఆయన చెప్పిన మాటలు హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ ఆ వీడియో బాగా నచ్చినట్లు వీడియోను స్పెషల్ గా పోస్ట్ చేశాడు.

​పాన్ ఇండియా స్టార్‌గా బిజీగా ఉన్నా కూడా, లోకల్ కంటెంట్‌ని ఫాలో అవుతూ ఇలాంటి మంచి మాటలను షేర్ చేయడం బన్నీ స్పెషాలిటీ అని చెప్పాలి. ప్రేమ అంటే కేవలం గిఫ్టులు ఇచ్చుకోవడం మాత్రమే కాదు, కష్టాల్లో తోడుండటమే అసలైన ప్రేమ అని ఈ వీడియో సందేశం ఇస్తోంది. ముఖ్యంగా నేటి తరం యువతకు కనెక్ట్ అయ్యేలా ఈ మాటలు ఉండటంతో నెటిజన్లు కూడా వీటిని తెగ షేర్ చేస్తున్నారు.

​మరొక వీడియోలో “ప్రేమ అనేది ఎదుటివారిని ప్రేమించడమే కాదు, వారు తమను తాము ప్రేమించుకునేలా చేయడమే అత్యున్నతమైన ప్రేమ” అనే లోతైన అర్థాన్ని బన్నీ షేర్ చేశారు. అలాగే ఒక ఇంగ్లీష్ కోట్ ఉన్న వీడియోను షేర్ చేస్తూ..

“చనిపోయిన తర్వాత పూలు ఇవ్వడం కాదు, నేను ఉన్నప్పుడే ప్రేమను చూపించండి” అనే అర్థం వచ్చేలా ‘లవ్ మీ టుడే’ అని క్యాప్షన్ ఇచ్చారు. అల్లు అర్జున్ షేర్ చేసిన ఈ వాలెంటైన్స్ డే పోస్టులు చాలా సింపుల్‌గా ఉన్నా, వాటిలో ఉన్న అర్థం మాత్రం చాలా గొప్పగా ఉంది. తన ఫాలోవర్స్ అందరికీ వాలెంటైన్స్ డే విషెస్ చెబుతూనే, ప్రేమలోని అసలైన విలువలను గుర్తు చేశారు మన స్టైలిష్ స్టార్.

This post was last modified on February 14, 2026 12:32 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

43 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago