Movie News

బన్నీని కావాలనే టార్గెట్ చేశారా?

కొద్దిసేపటి క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ ఒక పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపాయి. అయితే ఈ విషయాన్ని లైట్ తీసుకోకుండా బన్నీ టీమ్ చాలా వేగంగా స్పందించింది.

బన్నీని కలవడానికి 42 నిబంధనలు ఉంటాయని, ఆయన కళ్లలోకి నేరుగా చూడకూడదనే వింత రూల్స్ ఉన్నాయని ఒక మీడియా సేల్స్ ప్రొఫెషనల్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. కానీ ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసం ఆడిన డ్రామానా అనే ఒక డౌట్ వస్తోంది. 

ఇంటర్వ్యూ చేసిన యాంకర్ తన ఇన్‌స్టా స్టోరీలో “మనం వైరల్ అయిపోయాం.. అందరూ నన్ను ట్యాగ్ చేయండి” అంటూ పెట్టిన పోస్టులు చూస్తుంటే, రీచ్ కోసమే ఈ పని చేసినట్లు క్లియర్ గా అర్థమవుతోందని బన్నీ ఫ్యాన్స్ బల్లగుద్ది చెబుతున్నారు. బన్నీ టీమ్ ఈ వ్యవహారంపై అఫీషియల్ నోట్ రిలీజ్ చేస్తూ ఘాటుగా స్పందించింది.

ఆయన మీద వస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమైనవని, అల్లు అర్జున్ ఎప్పుడూ అత్యంత గౌరవప్రదంగా ఉంటారని స్పష్టం చేసింది. కేవలం వ్యూస్ కోసం ఒక స్టార్ హీరో ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేలా మాట్లాడటం కరెక్ట్ కాదని టీమ్ పేర్కొంది. ఇలాంటి ఫేక్ కంటెంట్‌ను స్ప్రెడ్ చేసే వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.

నిజానికి సదరు యాంకర్ సబ్స్క్రైబర్లు 500 కూడా లేకపోవడంతో, రీచ్ పెంచుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినట్లు నెటిజన్లు కూడా విమర్శిస్తున్నారు. తన రీల్ వైరల్ అయినందుకు ఆమె ఎంతో ఆనందపడుతూ పెట్టిన పోస్టులే ఇదొక ప్లాన్డ్ పబ్లిసిటీ స్టంట్ అని ఫ్యాన్స్ ఆమె స్టోరీ స్క్రీన్ షాట్స్ ని మరింత వైరల్ చేస్తున్నారు. ఇక లీగల్ నోటీసు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

This post was last modified on February 10, 2026 6:34 pm

Share

Recent Posts

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

48 minutes ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

58 minutes ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

1 hour ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

3 hours ago

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

7 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

8 hours ago