Movie News

బన్నీని కలవాలంటే అన్ని కండిషన్లా?

ఒకప్పుడు టాలీవుడ్లో మిడ్ రేంజ్ స్టార్లలో ఒకడిగా ఉండేవాడు అల్లు అర్జున్. కానీ ఇప్పుడు టాలీవుడ్ అనే కాదు.. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడిగా ఎదిగాడు. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తెలుగులో ఇండస్ట్రీ హిట్ కొట్టిన బన్నీ.. ‘పుష్ప’ సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అతి పెద్ద విజయాల్లో ఒకటనదగ్గ స్థాయి హిట్ కొట్టాడు. దీంతో తన రేంజ్ మారిపోయింది. అందుకు తగ్గట్లే పీఆర్ బలాన్ని కూడా పెంచుకున్నాడు.

బన్నీ కోసం పదుల సంఖ్యలో పీఆర్ టీమ్స్ పని చేస్తుంటాయని అందరికీ తెలుసు. అలాగే అభిమాన సంఘాలను కూడా పకడ్బందీగా మెయింటైన్ చేస్తుంటారు. వీటిని మెయింటైన్ చేయడానికే లక్షల్లో ఖర్చు చేస్తారన్నది కూడా బహిరంగ రహస్యమే. బన్నీ చుట్టూ పీఆర్ వలయం ఎలా ఉంటుంది.. మీడియా వాళ్లు కలిసినా ఎన్ని రూల్స్ పెడతారు అన్నది బాలీవుడ్ బ్రాండ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ కావేరి బరువా ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.

బన్నీని కలవాలంటే డూస్ అండ్ డోంట్స్ అంటూ 40 పాయింట్లతో లిస్టు ఉంటుందని ఆమె చెప్పడం విశేషం. ‘‘నా కెరీర్లో ఇంట్రెస్టింగ్ మీటింగ్స్‌లో అల్లు అర్జున్‌‌తో జరిగింది ఒకటి. ఆయన హైదరాబాద్ మెగాస్టార్. సౌత్ ఇండియన్ స్టార్ హీరోలకు పరివారం చాలా పెద్దగా ఉంటుంది. ఆయన్ని కలవడానికి ముందు ఏం చేయాలి, ఏం చేయకూడదు అంటూ 40 పాయింట్లతో ఒక లిస్ట్ ఇచ్చారు.

ఆయన మేనేజర్‌కు మేనేజర్, తన కింద ఇంకో మేనేజర్.. ఇలా చాలామంది ఉన్నారు. వాళ్లు చాలా కండిషన్లు పెట్టారు. సార్ కళ్లలోకి చూడకూడదు. ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఆయన్ని ఎప్పుడూ సార్ అనే అనాలి’’ అంటూ లిస్టు చదివారు కావేరి బరువా. ఎందుకు ఈ రూల్స్ అన్ని అని ఇంటర్వ్యూయర్ అడిగితే నాకేం తెలుసు అన్నారు కావేరీ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బన్నీని కలవాలంటే ఇన్ని రూల్సా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో చూసి. కానీ బన్నీ అభిమానులను ఎంత హుందాగా దగ్గరకు తీసుకుంటాడో అంటున్న అభిమానులు తమ ఫోటోలు షేర్ చేస్తూ ఇదొక నెగెటివిటీ స్టంట్ అంటూ బన్నీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ విషయంపై బన్నీ టీం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

This post was last modified on February 10, 2026 5:12 pm

Share

Recent Posts

`వ‌ర్గాల‌`కు దూర‌మ‌వుతున్న వైసీపీ.. ?

రాష్ట్ర రాజకీయాల్లో ప్ర‌త్య‌ర్థుల‌తో వైరం ఎలా ఉన్నా.. ప్ర‌జ‌ల‌తో మాత్రం పార్టీల‌కు సాన్నిహిత్యం ఉండాలి. అది కొర‌వ‌డితే.. ఎప్పటికీ చేరువ…

48 minutes ago

నాని సినిమాలో ఆ పార్ట్… ద‌ర్శ‌కుడికీ న‌చ్చ‌లేద‌ట‌

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్లో ప్ర‌త్యేకంగా చెప్పుకోద‌గ్గ చిత్రాల్లో శ్యామ్ సింగ‌రాయ్ ఒక‌టి. ట్యాక్సీవాలాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయిన రాహుల్…

58 minutes ago

నాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు

పెద్ద బ‌డ్జెట్ పెట్టి, చాలా కాలం క‌ష్ట‌ప‌డి, ఎన్నో ఆశ‌ల‌తో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వ‌స్తే త‌ట్టుకోవ‌డం తేలిక…

1 hour ago

అమ‌రావతికి పంచ సూత్రాలు… చంద్ర‌బాబు భారీ ప్లాన్‌

ఏపీ సీఎం చంద్ర‌బాబు రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో అత్యంత శ్ర‌ద్ధ చూపిస్తున్న విష‌యం తెలిసిందే. రైతుల నుంచి భూములు స‌మీక‌రించ‌డం(పూలింగ్‌)…

3 hours ago

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

7 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

8 hours ago