Movie News

వెంకటేష్ ఫహద్ కోసం ముగ్గురు భామలు ?

దగ్గుబాటి అభిమానులు ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ దర్శకుడు అనిల్ రావిపూడి పదో సినిమా. ప్రస్తుతం క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్న ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు ఇప్పుడప్పుడే ప్రకటన ఇచ్చే ఆలోచనలో లేరని ఇన్ సైడ్ టాక్. ప్రస్తుతం ఓటిటి డీల్స్ చర్చల దశలో ఉన్నందున అవి ఫైనల్ అయ్యాకే గ్రాండ్ గా చెప్పేద్దామని నిర్మాతలతో అన్నారట.

ఎన్ని వందల కోట్లు వసూలు చేసినా అనిల్ గత చిత్రాలు సంక్రాంతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ గారు ప్రొడక్షన్ లో ఉన్నప్పుడు డిజిటల్ ఒప్పందాల విషయంలో ఇబ్బంది పడ్డాయి. ఈసారి అవి రిపీట్ కాకూడదనే ఉద్దేశంతో కొంచెం నెమ్మదిగా ఉన్నారట.

ఇక ఇందులో హీరోయిన్లను దాదాపు లాక్ చేశారని వినికిడి. వెంకటేష్ జోడిగా కీర్తి సురేష్, పూజా హెగ్డేల పేర్లు పరిశీలనలో ఉండగా ఫహద్ ఫాసిల్ పెయిర్ గా ఆషిక రంగనాథ్ ఆల్మోస్ట్ ఫిక్స్ అంటున్నారు. పూజా హెగ్డే గతంలో అనిల్ కోసం ఎఫ్3లో స్పెషల్ సాంగ్ చేసింది. వెంకీ, వరుణ్ తేజ్ సరసన ఆడిపాడింది. సో ఈ కాంబోలో ఆశ్చర్యం లేదు.

ఇక కీర్తి సురేష్ తెలుగులో మరో బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. రావిపూడి లాంటి ఫన్ డైరెక్టర్ తో పని చేస్తే మరోసారి కెరీర్ ఊపందుకోవచ్చు. కాకపోతే సంక్రాంతికి వస్తున్నాంలో ఐశ్వర్య రాజేష్ తరహాలో ఉంటుందో లేక ఇంకేదయినా స్పెషల్ గా డిజైన్క్ చేస్తారేమో చూడాలి.

2027 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ మల్టీస్టారర్ లో వెంకీ, ఫహద్ బావ బావమరుదులుగా కనిపిస్తారని ఆల్రెడీ లీక్ చక్కర్లు కొడుతోంది. వీళ్ళతో పాటు హీరోయిన్లు చేసే అల్లరి మెయిన్ హైలైట్ గా ఉంటుందని చెబుతున్నారు. భీమ్స్ సంగీతం సమకూర్చబోయే ఈ ఎంటర్ టైనర్ కు అనిల్ రావిపూడి రెగ్యులర్ టీమే పని చేయబోతోంది. ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. నవంబర్ కంతా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ కల్లా ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునే టార్గెట్ పెట్టుకున్న అనిల్ రావిపూడి దాన్ని ఖచ్చితంగా మీట్ అవుతారు. ఎందుకంటే విఎఫ్ఎక్స్, హై స్కేల్ బడ్జెట్స్ తన డిక్షనరిలో ఉండవు. సో ఈజీగా చేరుకుంటారు.

This post was last modified on February 10, 2026 1:15 pm

Share

Recent Posts

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

2 hours ago

భారత్ vs పాక్ ఫైనల్… ఈసారి అతను కనిపించడు

భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…

3 hours ago

వీసా చేతిలో ఉన్నా రద్దే… అమెరికా కొత్త చెకింగ్ ఇదే!

అమెరికా వీసా వచ్చేసింది కదా.. ఇక దాని గడువు ముగిసే వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటే పొరపాటే. వీసా…

3 hours ago

బొద్దింక‌ల నిర‌స‌న‌… ఈసారి ఇంకా గట్టిగా!!

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ(సీజేపీ).. తాజాగా మ‌రో ఉద్య‌మానికి తెర‌దీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్‌.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…

3 hours ago

ఆ పరిస్థితిలో హనుమాన్ చాలీసాను పఠించిన కెప్టెన్

హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్ర‌మించేవారు కొంద‌రైతే.. తాము చేసిన ప‌నుల కార‌ణంగా చూపిన ధైర్య సాహ‌సాల కార‌ణంగా రాత్రికి…

5 hours ago

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

6 hours ago