Movie News

ఎల్లమ్మ కోసం వింటేజ్ విలన్ కావాలి

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ వేణు యెల్దండి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఎల్లమ్మ మరికొద్ది రోజుల్లో రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. అయితే క్యాస్టింగ్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన పనులు పెండింగ్ ఉండటంతో ఇంకా సెట్స్ లో పూర్తి స్థాయిలో అడుగు పెట్టలేదు.

చాలా కీలకమైన విలన్ పాత్ర కోసం నటనకు దూరంగా ఉన్న వింటేజ్ హీరోని ట్రై చేసే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం. ముందు వరసలో వడ్డే నవీన్ పేరు వినిపిస్తోంది. ఒకప్పుడు కోరుకున్న ప్రియుడు, పెళ్లి, స్నేహితులు లాంటి సూపర్ హిట్లతో మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన నవీన్ వడ్డే తర్వాత వ్యాపారం వైపు షిఫ్ట్ అయిపోయాడు.

త్వరలోనే హీరోగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఇటీవలే అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. అలాంటప్పుడు విలన్ పాత్రకు మొగ్గు చూపిస్తాడా అనేది అనుమానమే. పైగా అతనిది సాఫ్ట్ ఫేస్. నెగటివ్ క్యారెక్టర్లకు అంతగా సూట్ కాదు. హీరోగా ఫామ్ లో ఉన్నప్పుడే ప్రేమించే మనసులో ఇలా ట్రై చేశాడు కానీ వర్కౌట్ కాలేదు. అందులో రవితేజ కూడా ఉంటాడు.

ఇప్పుడు ఇంత గ్యాప్ తర్వాత జనం రిసీవ్ చేసుకోవడం అనుమానమే. చిరునవ్వుతో వేణు తొట్టెంపూడి ఆ మధ్య దమ్ము., రామారావు ఆన్ డ్యూటీలతో పునఃప్రవేశం చేసినా జనం పట్టించుకోలేదు. వరుణ్ సందేశ్ ఇప్పటికీ ఏదో ఒక సినిమాతో పోరాడుతూనే ఉన్నాడు.

మరి ఫైనల్ గా ఎల్లమ్మ విలన్ ఎవరవుతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. తెలంగాణ జానపద కళాకారుల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ డివోషనల్ కం ఫిక్షనల్ డ్రామాకు ఇంకా హీరోయిన్ ఎవరో ప్రకటించలేదు. పాటలు రికార్డింగ్ చేసి లాక్ చేసిన స్క్రిప్ట్ తో వేణు రెడీగా ఉన్నాడు.

ఒక్కసారి ఆర్టిస్టులు ఫైనల్ అయిపోతే చకచకా పరుగులు పెట్టించడమే ఉంటుంది. ఈ ఏడాది దసరా లేదా దీపావళి విడుదలను టార్గెట్ గా పెట్టుకుంటున్నారు కానీ ప్రొడక్షన్ కాస్ట్, విఎఫెక్స్ పనులు చూస్తుంటే అంత ఈజీగా అయ్యేలా లేదు. బలగం తర్వాత మూవీ కావడంతో వేణు యెల్దండికి బిగ్ లీగ్ లోకి ప్రవేశించడానికి ఎల్లమ్మ మంచి అవకాశం. 

This post was last modified on February 8, 2026 11:21 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

35 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago