ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో న్యాచురల్ స్టార్ నాని ఇది ఫేస్ చేశాడు. జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం 2015 మార్చి 21 ఒకేసారి థియేటర్లలో అడుగు పెట్టాయి. ఒకటి విజయం సాధించడం మరొకటి డిజాస్టర్ కావడం వేరే సంగతి.
అంతకు ముందు బాలకృష్ణకు ఓసారి జరిగింది. నిప్పురవ్వ, బంగారు బుల్లోడు 1993 సెప్టెంబర్ 3 ప్రేక్షకుల ముందుకొచ్చాయి. ఒకటి యావరేజ్ దగ్గర ఆగిపోగా రెండోది ఘనవిజయం అందుకుంది. అందుకే స్టార్లు ఇలా క్లాష్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. చూస్తుంటే శ్రీవిష్ణుకి అలాంటి సంకటం వచ్చేలా ఉంది.
వివరాల్లోకి వెళ్తే శ్రీవిష్ణు నటించిన మృత్యుంజయ్, విష్ణు విన్యాసం రెండూ ఫిబ్రవరి విడుదల లాక్ చేసుకున్నాయి. మొదటిది 27 తేదీని అధికారికంగా కర్చీఫ్ వేసి ప్రకటన కూడా ఇచ్చేసింది. హఠాత్తుగా ఎందుకు చేసిందంటే రెండోది అదే డేట్ ఫిక్స్ చేసుకుని అనౌన్స్ మెంట్ ఇచ్చే స్టేజిలో ఉంది కాబట్టి.
మరి ఇప్పుడు ఈ రెండూ నాని, బాలయ్య కు వచ్చినట్టు ఒకే రోజు వచ్చి శ్రీవిష్ణుని ఇబ్బంది పెడతాయా లేక కొంచెం గ్యాప్ ఏమైనా తీసుకుంటాయా వేచి చూడాలి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం ఓటిటి అగ్రిమెంట్లు జరిగిపోయాయి కాబట్టి ఇదే నెలలో రావడం తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు. కాకపోతే ఒక వారం అడ్జస్ట్ చేసుకుని మార్చుకోవచ్చు.
అలా జరిగినా సరే శ్రీవిష్ణుకి ఇబ్బంది తప్పదు. ఎందుకంటే ఒకే హీరో రెండు నోటెడ్ రిలీజుల మధ్య కనీస స్పేస్ ఉండాలి. లేదంటే ఒక దాని మీద ఆడియన్స్ ఆసక్తి సన్నగిల్లుతుంది. ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాల క్రితం ఇలా చెల్లుబాటు అయ్యేది కానీ ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యపడటం లేదు.
పైగా శ్రీవిష్ణుకి యూత్ లోనే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. మృత్యుంజయ్, విష్ణు విన్యాసం రెండు వేర్వేరు జానర్లు అయినప్పటికీ ఇలా కంటిన్యూగా రావడం వల్ల ఫ్యాన్స్ కన్ఫ్యూజయ్యే రిస్క్ లేకపోలేదు. మరి హీరో తన నిర్మాతలను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడో లేక డబుల్ బొనాంజా ఇస్తాడో లెట్ వెయిట్ అండ్ సీ.
Gulte Telugu Telugu Political and Movie News Updates