Movie News

బిగ్ బాస్-4 విన్నర్ ట్విస్ట్!


‘బిగ్ బాస్’ నాలుగో సీజన్లో అభిజిత్ విజేతగా నిలుస్తాడన్నది ప్రేక్షకుల అంచనా. ఎందుకంటే సోషల్ మీడియాలో అతడి ఫాలోయింగ్ అలా ఉంది మరి. కొన్ని వారాలుగా ఎక్కడ ఏ పోల్ పెట్టినా అభిజితే టాప్‌లో ఉంటున్నాడు. మేనేజ్ చేస్తున్నారో, స్వతహాగా ఉన్న ఫాలోయింగో కానీ.. సోషల్ మీడియాలో అభిజిత్ పేరు మీద ట్రెండ్స్ చూస్తే అతనే హౌస్‌లో మోస్ట్ పాపులర్ అని ఎవ్వరికైనా అర్థమవుతుంది.

రెండో సీజన్లో కౌశల్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుని, ఎక్కుమంది ఆమోదం పొందిన కంటెస్టెంట్‌గా అభిజిత్‌ను చెప్పుకోవచ్చు. కౌశల్ విషయంలో అదే స్థాయిలో నెగెటివిటీ కూడా కనిపించింది కానీ.. అభిజిత్‌ పట్ల జనాల్లో అలాంటి వ్యతిరేకతే కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అతను బిగ్ బాస్-4 విన్నర్ కావడం ఖాయం అనే అభిప్రాయాల్లో జనం ఉన్నారు. కానీ క్లైమాక్స్‌లో పెద్ద ట్విస్ట్ ఇవ్వడానికి ‘బిగ్ బాస్’ టీం రెడీ అవుతున్నట్లుగా సంకేతాలు వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తొలి మూడు సీజన్లలోనే మేల్ కంటెస్టెంటే విజేతగా నిలిచిన నేపథ్యంలో.. ఈసారి కూడా పురుషుడే గెలిస్తే ‘బిగ్ బాస్’లో అమ్మాయిలు గెలవరు అనే అభిప్రాయం పడిపోతుందేమో అన్న ఉద్దేశంతో విజేతను ‘మార్చడానికి’ సన్నాహాలు జరుగుతున్నట్లుగా ఓ ప్రచారం నడుస్తోంది. ఈ సీజన్లో అంచనాలకు భిన్నంగా అరియానా విజేతగా నిలిస్తే ఆశ్చర్యం లేదంటున్నారు. మొన్నటిదాకా అన్ని పోల్స్‌లో, ఓటింగ్స్‌లో అభిజిత్, సోహై‌ల తర్వాత మూడో స్థానంలో ఉంటూ వచ్చిన అరియానా.. గత రెండు మూడు రోజులుగా పోల్స్, ఓటింగ్స్‌లో టాప్‌లో కనిపిస్తుండటం ఈ సందేహాలకు బలం చేకూరుస్తోంది.

‘బిగ్ బాస్’ విజేతన పూర్తిగా ప్రేక్షకుల ఓటింగ్‌ను బట్టే ఉంటుందని నిర్వాహకులు అంటుంటారు కానీ.. ఎలిమినేషన్లలో కొన్నిసార్లు ఫలితాలు చూస్తే ఈ షో అంతా స్క్రిప్టెడ్ ఏమో అనిపించక మానదు. లేదంటే జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న మోనాల్ షో చివరి వారం ముందు వరకు హౌస్‌లో కొనసాగేది కాదు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్-3 విజేతగా అరియానాను నిలబెట్టేందుకు నిర్వాహకులు స్క్రిప్టు రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిజంగా అదే జరిగితే షో విశ్వసనీయత దెబ్బ తినడం ఖాయం. మరి ఏమవుతుందో చూడాలి.

This post was last modified on December 17, 2020 4:28 pm

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

35 minutes ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

52 minutes ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

1 hour ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

2 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

4 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

6 hours ago