డైరెక్టర్ కమ్ హీరోగా సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ యూత్ ఫుల్ హీరోగా సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు ప్రదీప్ రంగనాథ్. సినిమా తీయాలన్న కలతో ముందు షార్ట్ ఫిల్మ్ తీసి టాలెంట్ చూపించిన అతను రవి మోహన్ తో డైరెక్షన్ ఛాన్స్ అందుకున్నాడు. అలా డైరెక్టర్ గా సక్సెస్ అందుకున్న అతను యాక్టర్ గా మారి తనే లీడ్ రోల్ చేస్తూ వరుస హిట్స్ అందుకుంటున్నాడు. యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన ప్రదీప్ రంగనాథ్ జెన్ Z ఆడియన్స్ కి ఏం కావాలో.. ఎలాంటి కంటెంట్ తో రావాలో తెలుసుకుని అలాంటి కథలు చేస్తున్నాడు.
సినిమాల మీద ఆసక్తి ఉంటే స్టడీస్ మీద అంత గురి ఉండదని అందరు అంటారు. ప్రదీప్ రంగనాథ్ కి కూడా చదువు మీద ఆసక్తి ఉండేది కాదట. అంతేకాదు పరీక్షలు వస్తే ఆన్సర్ షీట్స్ ని కథలతో నింపేస్తాడట. పరీక్షలో స్టోరీస్ రాసే వాడట ప్రదీప్ రంగనాథ్. అది చూసి టీచర్స్ పనిష్మెంట్ ఇచ్చేవారట. ఐతే అప్పటి ప్రదీప్ స్టోరీస్ అతనికి పనిష్మెంట్ వచ్చేలా చేసినా ఇప్పుడు అతను రాస్తున్న కథలకు అతనికి అవార్డులు వచ్చేలా చేస్తున్నాయి. స్టోరీ రైటింగ్, స్క్రీన్ రైటింగ్ లో రీసెంట్ గానే అవార్డ్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథ్.
స్కూల్ డేస్ లో కథలు రాస్తే టీచర్ పనిష్మెంట్ ఇవ్వగా.. ఇప్పుడు అతను రాస్తున్న కథలకు అవార్డులు వస్తున్నాయి. అప్పుడేదో సరదాగా రాసి ఉండొచ్చు కానీ ఇప్పుడు ప్రదీప్ కథలు అంత డిమాండ్ తెచ్చుకున్నాయి.. ముఖ్యంగా అతను మాత్రం యూత్ ఆడియన్స్ టార్గెట్ తోనే కథలను రాస్తున్నాడు. లాస్ట్ సినిమా డ్యూడ్ తో కూడా ప్రదీప్ మరో 100 కోట్ల సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు.
ఐతే ఓ పక్క అతను యాక్టర్ గా బిజీగా ఉండగా డైరెక్టర్ గా మళ్లీ మెగా ఫోన్ ఎప్పుడు పడతారనే ఆసక్తి ఆడియన్స్ లో ఉంది. లవ్ టుడే తర్వాత ప్రదీప్ కి మళ్లీ డైరెక్షన్ చేసే తీరిక లేకుండా ఉంది. ప్రస్తుతం ప్రదీప్ L.I.K సినిమా చేస్తున్నాడు. కొన్నాళ్లుగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా వాలెంటైన్స్ డే సందర్భంగా రాబోతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates