నేటి రోజుల్లో రూపాయి చేయిజారి కింద పడితేనే వెనక్కి ఇచ్చేవాళ్లు అరుదుగా కనిపిస్తున్నారు. అలాంటిది ఏకంగా రూ.45 లక్షల విలువైన బంగారాన్ని చూసి కూడా ఆశపడకుండా పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది పద్మ అనే పారిశుధ్య కార్మికురాలు.
టీ నగర్ ఆలయం సమీపంలో ఆమెకు దొరికిన 45 తులాల బంగారాన్ని ఏమాత్రం ఆలోచించకుండా అధికారులకు అందించిన పద్ధతి అప్పట్లోనే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈమె గొప్ప మనసును గుర్తించిన సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు.
తన నిజాయితీతో అందరినీ ఇన్‌స్పైర్ చేసిన పద్మను రజినీకాంత్ తన ఇంటికి పిలిపించుకొని అభినందించారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా ఆమెకు ఒక బంగారు గొలుసును బహుమతిగా అందించినట్లు తెలుస్తోంది. పద్మ చేసిన పనికి సూపర్ స్టార్ ఫిదా అయిపోయి, ఆమెతో కలిసి ఫోటోలు దిగి తన సంతోషాన్ని పంచుకున్నారు. సెలబ్రిటీలు ఇలాంటి సామాన్యులను గుర్తించి అభినందించడం నిజంగా గ్రేట్ అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
రజినీకాంత్ పద్మకు కేవలం గిఫ్ట్ ఇవ్వడమే కాకుండా, ఆమెకు లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇచ్చేలా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆమెకు ప్రతి నెలా రూ.10,000 ఆర్థిక సాయం అందజేస్తానని సూపర్ స్టార్ హామీ ఇచ్చారట. సామాన్య కార్మికురాలిగా పని చేస్తూ ఇంతటి నిజాయితీని ప్రదర్శించిన ఆమెకు ఈ సాయం ఒక గొప్ప ఊరట అని చెప్పొచ్చు. ఇలాంటి రివార్డులు నిజాయితీగా ఉండే మరికొంతమందికి స్ఫూర్తినిస్తాయని చెప్పడంలో సందేహం లేదు.
పద్మ చేసిన ఈ పనిపై గతంలోనే సోషల్ మీడియాలో స్థానిక పోలీసుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. కష్టపడి పని చేసే తత్వం, ఎదుటివారి వస్తువులపై ఆశ పడని గుణం ఉన్న పద్మను సూపర్ స్టార్ స్వయంగా పిలిచి గౌరవించడం ఆమె నిజాయితీకి దక్కిన అసలైన గౌరవం. ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కేవలం డబ్బు వెనక పరుగులు తీయకుండా, నైతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తే సమాజంలో గుర్తింపు ఎలా వస్తుందో పద్మ లైఫ్ ఒక ఉదాహరణ అని చెప్పవచ్చు.
This post was last modified on February 3, 2026 12:47 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…
సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…
అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…