Movie News

వేసవి సినిమాల పాటల జోరు… ఆగకుండా సాగాలి

సమ్మర్ లక్ష్యంగా పెట్టుకున్న పెద్ద సినిమాల విడుదల తేదీ విషయంలో క్లారిటీ లేక అభిమానులు తెగ వర్రీ అవుతున్నారు. పెద్ది, ప్యారడైజ్ మార్చి నెలని వదలేశాక ఆ స్లాట్ ని ఎవరు వాడుకుంటారో అర్థం కావడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుందనే ప్రచారం జరిగింది కానీ అది కూడా ఏప్రిల్ వైపు చూస్తోంది.

ఇంకోవైపు రామ్ చరణ్, నాని బృందాలు కొత్త డేట్ కోసం చేస్తున్న కసరత్తు కొలిక్కి రావడం లేదు. మార్చి 19 రిలీజ్ కాబోతున్న దురంధర్ 2 మేనియా చూస్తుంటే దానితో నేరుగా తలపడటం అంత రిస్క్ కాదనేది డెకాయిట్ టీమ్ ని ఆలోచనలో పడేసింది. పైగా యష్ టాక్సిక్ కూడా ఉన్న నేపథ్యంలో పోటీ సేఫ్ అనిపించుకోదు.

అఖిల్ లెనిన్ మే 1 అని చెప్పేశారు కానీ దానికి కట్టుబడి ఉంటారా లేదానేది పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. సరే రిలీజుల సంగతి ఎలా ఉన్నా ముందైతే పాటల పరుగును ఈ సినిమాలు ఆపకపోవడం మంచిది. ఎందుకంటే బజ్ అనేది తగ్గకుండా స్టడీగా ఉండాలంటే దానికి బలమైన పునాది వేసేది సాంగ్సే.

చికిరి చికిరి సృష్టించిన సెన్సేషన్ పెద్దికి నేషనల్ వైడ్ హైప్ తీసుకొచ్చింది. ఇదే స్ట్రాటిజిని మిగిలిన వాళ్ళు ఫాలో కావాలి. ప్యారడైజ్ కు మ్యూజిక్ ఇస్తున్న అనిరుధ్ రవిచందర్ ఈ టైంలో కనక ఒక చార్ట్ బస్టర్ సాంగ్ ఇస్తే నాని మూవీ మీద ప్యాన్ ఇండియాలో అటెన్షన్ వచ్చేస్తుంది. శ్రీకాంత్ ఓదెల దీని మీద దృష్టి పెట్టాలి.

ఉస్తాద్ భగత్ సింగ్, లెనిన్ ఆల్రెడీ చెరో పాట వదిలేశాయి. బాగా రీచ్ అయ్యాయి. ఈ మూమెంట్ తగ్గకుండా కొనసాగాలంటే రెగ్యులర్ బ్రేక్స్ లో సాంగ్స్ వదులుతూనే ఉండాలి. డెకాయిట్ టీజర్ వల్ల అంచనాలు ఏర్పడ్డాయి. వాటిని బలపరచాల్సింది పాటలే.

భీమ్స్ కంపోజింగ్ కనక నమ్మకం పెట్టుకోవచ్చు. సినిమాల రిలీజ్ డేట్లు ఎంత ఆలస్యంగా ఉన్నా ఇలా మ్యూజిక్ అప్డేట్స్ వల్ల అభిమానుల్లో ఉత్సాహం తగ్గకుండా స్టడీగా ఉంటుంది. కాకపోతే మార్చి నుంచి మొదలవ్వాల్సిన బాక్సాఫీస్ సమ్మర్ ఈసారి ఏప్రిల్ లేదా మే నుంచి షురూ అయ్యేలా ఉంది. థియేటర్ల కోణంలో చూసుకుంటే ఈ అంశాన్ని లోటుగానే పరిగణించాలి.

This post was last modified on February 3, 2026 12:21 pm

Share

Recent Posts

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

21 minutes ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

1 hour ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

2 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

3 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

5 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

5 hours ago