ఆచితూచి సినిమాలు చేసే సాయిపల్లవి నెంబర్ల కోసం ఎప్పుడూ పాకులాడలేదు. వచ్చిన ఆఫర్లన్నీ ఒప్పేసుకుని ఎక్కువ సంపాదించాలనే యావ చూపించలేదు. విరాట పర్వం ఫ్లాప్ అయినా, తండేల్ హిట్ అయినా తన ధోరణిలో ఎలాంటి మార్పు ఉండదు.
భోళా శంకర్ లో చిరంజీవి చెల్లెలిగా నటించే అవకాశం వచ్చినా కేవలం రీమేకనే కారణంతో వద్దని చెప్పడం తన స్థిరమైన ఆలోచనలకు నిదర్శనం. అందుకే నాలుగు వేలకోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న రామాయణలో సీతగా ఛాన్స్ కొట్టేసింది. ఈ కంటెంట్ కనక కరెక్ట్ గా క్లిక్ అయితే ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు రావడమే కాదు కొన్ని జనరేషన్లకు సీతగా గుర్తుండిపోతుంది.
ఇదిలా ఉండగా త్వరలో ప్రారంభం కానున్న కల్కి 2లో సాయిపల్లవిని ఫైనల్ చేసినట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ లీక్ గత వారమే వచ్చినప్పటికీ తాజాగా ఓకే అయ్యిందని వినికిడి. అయితే అధికారిక ప్రకటన వెంటనే ఇవ్వకపోవచ్చు కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక దీనికి సంబంధించిన అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.
సాయిపల్లవి బాలీవుడ్ డెబ్యూ ఏక్ దిన్ వేసవి విడుదలకు రెడీ అవుతోంది. ఆ మధ్య టీజర్ కూడా వదిలారు. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ఈ లవ్ ఎమోషనల్ డ్రామా మే 1 ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇది తనకు టెస్టింగ్ లాంచ్ అని చెప్పొచ్చు.
ఇవి కాకుండా ధనుష్ 55వ సినిమాలోనూ సాయిపల్లవి ఉంది. ఈ సినిమాలన్నీ కూడా పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసేవే. ఏదీ రెగ్యులర్ ఫ్లేవర్ లో ఉండదు. ఈ ఏడాదితో కలిపి మొత్తం మూడు సంవత్సరాల్లో ఎవరూ అందుకోలేని మైలురాళ్ళు తనకు దక్కే ఛాన్స్ పుష్కలంగా ఉంది.
రామాయణ మొదటి భాగం ఇప్పటికే పూర్తయిపోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. దీపావళి రిలీజ్ ఆల్రెడీ అనౌన్స్ చేసేశారు కాబట్టి దానికి అనుగుణంగా స్పీడ్ పెంచారు. రెండో భాగం బ్యాలన్స్ కూడా ఈ సంవత్సరమే అయిపోతుందని అంటున్నారు. కల్కి ఫిక్స్ అయితే మొత్తం అయిదు సినిమాల్లో సాయిపల్లవి కనిపించనుంది.
This post was last modified on February 3, 2026 11:00 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…