Movie News

‘ఒరేయ్ తరుణ్ భాస్కర్… క్యారెక్టర్లో ఉండిపోకు’

దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’ రిలీజైనపుడు ఆశించినంత స్పందన తెచ్చుకోకపోయినా.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. మూడో సినిమా ‘కీడా కోలా’ ఓ మాదిరిగా ఆడింది. ఐతే దర్శకుడిగా ఎక్కువ సినిమాలు చేయకపోయినా.. మరోవైపు నటుడిగా మెప్పిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉన్నాడు తరుణ్ భాస్కర్. 

ఇప్పుడు అతను తొలిసారిగా లీడ్ రోల్ చేసిన ‘ఓం శాంతి శాంతి శాంతి:’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మలయాళ హిట్ ‘జయ జయ జయ జయహే’కు రీమేక్‌ అయినప్పటికీ.. ఈ చిత్రానికి తెలుగులో మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సందర్భంగా తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్.. తన కొడుక్కి శుభాకాంక్షలు చెప్పిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. 

‘‘ఒరేయ్ తరుణ్ భాస్కర్.. ఆల్ ద బెస్ట్. చేసినావు అయిపోయింది. రోల్‌లో ఉండిపోకురా ప్లీజ్. నా పెంపకం దెబ్బ తింటది. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ అని ఆమె సోషల్ మీడియాలో కామెంట్ చేశారు. ఈ చిత్రంలో హీరోది భార్య మీద జులుం చూపించే పాత్ర. పదే పదే భార్యను కొడుతుంటాడు. చివరికి భార్య అతడి మీద ఎదురు తిరిగి తనకు బుద్ధి చెబుతుంది.

పురుషాధిక్యతకు ప్రతీకగా నిలిచే పాత్ర కావడంతో తన కొడుకుని ఆ పాత్రలో ఉండిపోవద్దని చెబుతున్నట్లున్నారు గీతా భాస్కర్. అందులోనూ ఈ చిత్ర కథానాయిక ఈషా రెబ్బాతో తరుణ్ ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గీతా కామెంట్స్ మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గీతా తన కొడుకు దర్శకుడు అయ్యాక, లేటు వయసులో నటిగా తన ముచ్చట తీర్చుకోవడం విశేషం. ‘ఫిదా’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘సీతారామం’ లాంటి చిత్రాల్లో సహజ నటనతో ఆమె ఆకట్టుకున్నారు.

This post was last modified on January 29, 2026 4:23 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు

ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…

13 minutes ago

‘వారణాసి’లో పోస్టర్లు… జక్కన్న పనేనా..?

రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

2 hours ago

ఆ సీన్ చూసిన త‌ర్వాత‌.. టీడీపీలో పెద్ద చ‌ర్చ.. !

టీడీపీలో ఏం జ‌రిగినా వార్తే.. విష‌యం ఏదైనా కూడా… నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ జ‌ర‌గాల్సిందే. తాజాగా పార్టీ కేంద్ర కార్యాలయంలో…

2 hours ago

మృణాల్… ఎట్టకేలకు తమిళ సినిమాలోకి

బాలీవుడ్ నుంచి హీరోయిన్లు దక్షిణాదికి దిగుమతి కావడం దశాబ్దాల నుంచి ఉన్న సంప్రదాయమే. చెప్పాలంటే సౌత్ ఇండస్ట్రీల్లో స్థానిక కథానాయికల కంటే నార్త్…

2 hours ago

జిరాఫీలను దత్తత తీసుకున్న పవన్

తనను తాను జంతు ప్రేమికుడిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి నిరూపించుకున్నారు. అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ…

3 hours ago

మహేష్ బాబు ముందున్న అసలైన సవాల్

​టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా తర్వాత హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే గ్లోబల్ రేంజ్…

4 hours ago