టాలీవుడ్‌లో రాజమౌళి సినిమా తర్వాత హీరోల పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. జక్కన్నతో సినిమా అంటే గ్లోబల్ రేంజ్ క్రేజ్ వస్తుంది కానీ, ఆ తర్వాత వచ్చే దర్శకుడు ఆ ఇమేజ్‌ను బ్యాలెన్స్ చేయలేక చేతులెత్తేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో ఉండాలనే విషయంలో చాలా పక్కాగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగా పేరు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.
రాజమౌళి సృష్టించే ఆ భారీ ఎత్తును అందుకోవాలంటే నేటి తరం దర్శకుల్లో సందీప్ వంగానే బెస్ట్ ఆప్షన్ అనే చర్చ నడుస్తోంది. రాజమౌళి స్వయంగా వంగా మేకింగ్ స్టైల్‌ను ఇష్టపడతారని చాలా సందర్భాల్లో చెప్పారు. కమర్షియల్ హంగులతో పాటు ఇంటెన్సిటీని చూపించడంలో వంగాకి ఒక సెపరేట్ రూట్ ఉంది. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ఆ ‘హై’ ని కొనసాగించాలంటే వంగా లాంటి మాస్ పల్స్ తెలిసిన దర్శకుడితో సినిమా పడితే బాక్సాఫీస్ దగ్గర మళ్ళీ రికార్డులు తిరగరాయచ్చనేది ఫ్యాన్స్ మాట.
అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ క్రేజీ కాంబో ఇప్పట్లో సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. సందీప్ వంగా తన పాత కమిట్‌మెంట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రభాస్‌తో ‘స్పిరిట్’ తర్వాత రణబీర్ కపూర్‌తో ‘యానిమల్ పార్క్’ షూటింగ్ 2027లో ప్రారంభం కాబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ వచ్చేసింది. దీని తర్వాత అల్లు అర్జున్ సినిమా లైన్ లో ఉంది. కాబట్టి మహేష్ బాబు వంగా కాంబినేషన్ కు ఇప్పట్లో ముహూర్తం కుదిరేలా లేదు.
మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ పూర్తి చేసుకుని 2027 లో ఫ్రీ అయ్యే అవకాశం ఉంది. సరిగ్గా అదే టైమ్‌కి వంగా కూడా తన సినిమాలతో బిజీగా ఉండటం వల్ల వీరిద్దరూ జతకట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఒకవేళ రాజమౌళి తర్వాత మహేష్ మరో ఆప్షన్ వెతుక్కోవాల్సి వస్తే, ఆ రేంజ్ ని తట్టుకునే దర్శకుడు ఎవరనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రాజమౌళి సినిమాతో వచ్చే పాన్ ఇండియా క్రేజ్‌ను కాపాడుకోవాలంటే పక్కా ప్లానింగ్ ఉండాలి.
This post was last modified on January 29, 2026 11:43 am
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…