Movie News

షకీలా సినిమా.. ఇష్టమొచ్చినట్లు


ఒకప్పుడు మలయాళ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన శృంగార తార షకీలా జీవిత కథ ఆధారంగా ‘షకీలా’ పేరుతో ఓ బహు భాషా చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ బాగానే చర్చనీయాంశం అయింది. ఇప్పుడు ట్రైలర్ కూడా వదిలారు. షకీలా జీవితంలో వాస్తవంగా ఏం జరిగిందో ఏమో కానీ.. ఈ సినిమాలో మాత్రం డ్రామాకు లోటు లేనట్లే కనిపిస్తోంది.

80ల్లో దక్షిణాది సినిమాల్లో శృంగార రసాన్ని ఒక రేంజిలో పండించిన సిల్క్ స్మిత హఠాన్మరణంతో ఏర్పడిన ఖాళీని పూరించడానికి.. షకీలా వచ్చినట్లుగా ఇందులో చూపించారు. చిన్న వయసులోనే తండ్రి మరణం, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో షకీలా సినిమాల్లోకి వచ్చి ముందుగా రొమాంటిక్ సినిమాల్లో నటించినట్లు.. ఆ తర్వాత సాఫ్ట్ పోర్న్ సినిమాల్లోకి అడుగు పెట్టినట్లు ప్రొజెక్ట్ చేశారు.

ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. షకీలా నటించిన సాఫ్ట్ పోర్న్ సినిమాల గురించి ట్రైలర్లో చూపించిన దృశ్యాలు మాత్రం ఆశ్చర్యం కలిగించేవే. ముఖం మాత్రమే నీది, బాడీ వేరే వాళ్లది అంటూ.. సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో షకీలా అసలు శృంగార సన్నివేశాలే చేయలేదు అన్నట్లుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం జరిగినట్లుగా ఉంది. అలాగే పంకజ్ త్రిపాఠి పోషించిన పాత్రను మమ్ముట్టికి అనుకరణగా భావించారు కానీ.. ట్రైలర్లో చూపించిన దృశ్యాలు చూస్తే అది పూర్తిగా కల్పితం అనిపిస్తోంది.

ఇంకా ట్రైలర్లో చూపించిన అనేక సన్నివేశాలు, షాట్లు గమనిస్తే షకీలా జీవితంలోని విషయాలను.. ఆమె స్థాయిని బాగా ఎగ్జాజరేట్ చేసి చూపించే ప్రయత్నం జరిగినట్లే ఉంది. బాలీవుడ్ నిర్మాతలు ప్రొడ్యూస్ చేసిన ఈ చిత్రాన్ని ఇంద్రజిత్ లంకేష్ రూపొందించాడు. షకీలా పాత్రను రిచా చద్దా పోషించిన ఈ సినిమా క్రిస్మస్ సీజన్లో థియేటర్లలో ఏమేర సందడి చేస్తుందో చూడాలి.

This post was last modified on December 16, 2020 1:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కరోనా వేళ ప్రభాస్‌తో డైరెక్టర్ శంకర్ చర్చలు!

తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…

43 minutes ago

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

2 hours ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

3 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

3 hours ago

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

4 hours ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

5 hours ago