Movie News

అభిమానులకు అభయమిస్తున్న దేవర 2

జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దేవర విడుదలై ఏడాదిన్నర దాటినప్పటికీ ఇప్పటిదాకా సీక్వెల్ ఊసు లేక ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతూ వచ్చారు. ఉంటుందని ఒకసారి, లేదని మరోసారి ఇలా రకరకాల ప్రచారాలు చర్చలోకి వచ్చాయి.

దర్శకుడు కొరటాల శివ బయట మీడియాకు కనిపించనంతగా అందుబాటులో లేకపోవడం అనుమానాలను మరింత బలపడేలా చేసింది. ఆ మధ్య తారక్ బర్త్ డే రోజు దేవర 2 ఉంటుందనే తరహాలో చిన్న పోస్టర్ వదిలారు తప్పించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ మిక్కిలినేని పార్ట్ 2 గురించి స్పందించడం వైరల్ అవుతోంది.

జనగాంలో జరుగుతున్న ఒక ఫెస్టివల్ ఈవెంట్ లో పాల్గొన్న సుధాకర్ స్టేజి మీద యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మే నుంచి దేవర 2 మొదలవుతుందని, వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని వేదిక సాక్షిగా హామీ ఇచ్చారు. మీ అంచనాలను మించిపోయేలా బ్లాక్ బస్టర్ అవుతుందని కూడా చెప్పేశారు.

అంటే ప్రశాంత్ నీల్ మూవీ అయ్యాక జూనియర్ ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదేనని క్లారిటీ వచ్చేసినట్టే. నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ ఎంతలేదన్నా ఏడాదికి పైగా సమయం పడుతుంది కాబట్టి 2027 దసరా లేదా దీపావళికి దేవర 2ని చూడొచ్చు. అయితే ఆ టైంకంతా మళ్ళీ హైప్ సృష్టించడం కొరటాల టీమ్ ముందున్న అతి పెద్ద బాధ్యత.

ఇన్స్ సైడ్ టాక్ ప్రకారం దేవర 2కి సంబంధించిన కొంత భాగం గతంలోనే షూట్ చేశారు. తర్వాత తారక్ వార్ 2 కోసం బిజీ కావడంతో దీన్ని పక్కన పెట్టాల్సి వచ్చింది. అందులోనూ ప్రశాంత్ నీల్ ని వదులుకుంటే మళ్ళీ దొరికే పరిస్థితి లేకపోవడంతో వెంటనే దానికి షిఫ్ట్ అయిపోయారు.

విశ్వసనీయ సమాచారం మేరకు దేవర 2 స్క్రిప్ట్ దాదాపుగా లాకైపోయింది. ఫస్ట్ పార్ట్ మీద వచ్చిన కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న టీమ్ ఇప్పుడీ సీక్వెల్ లో ఎలాంటి కంప్లయింట్స్ కి ఆస్కారం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందట. పెద్ద దేవర ఎలా చనిపోయాడు, వర ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు లాంటి ప్రశ్నలకు సమాధానం దేవర 2లో చూడాలి.

This post was last modified on January 27, 2026 11:26 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

3 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

5 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago