మాస్ మహారాజా రవితేజ సంక్రాంతి పందెంలో విన్నర్ కాకపోయినా భర్త మహాశయులకు విజ్ఞప్తితో గత సినిమాల కంటే కొంచెం బెటరనిపించడం అభిమానులకు ఊరట కలిగించింది. కానీ ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే కథ చేయాలనుందని కోరి మరీ రాయించుకోవడం తప్ప దర్శకుడు తిరుమల కిషోర్ కంటెంట్ పరంగా ఎలాంటి ప్రత్యేకత చూపించలేకపోయారు.
ఏదో కామెడీతో నెట్టుకొచ్చారు తప్పించి యూనిట్ చెప్పినంత స్థాయిలో ఫ్యామిలీస్ కి కనెక్ట్ కాలేదన్నది నిజం. అందుకే ఫ్యాన్స్ సరైన కంబ్యాక్ కోసం మరింత ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ కోరిక శివ నిర్వాణ తీర్చేలా ఉన్నారు.
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న మూవీకి ఇరుముడి టైటిల్ ఫిక్స్ చేస్తూ ఇవాళ మాస్ మహారాజా పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇది గతంలోనే లీకైనప్పటికీ ఫైనల్ గా అఫీషియల్ ముద్ర పడింది.
పోస్టర్ చూస్తే అయ్యప్ప మాలలో కూతురుని ఎత్తుకుని చుట్టూ భక్తులతో రవితేజ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ గెటప్ లో సినిమాలు చేసిన తెలుగు హీరోలు చాలా తక్కువ. బిగ్ బాస్ లో చిరంజీవి ఓ ముప్పావు గంట కనిపిస్తారు కానీ ఇరుముడిలో రవితేజ అంతకన్నా ఎక్కువ స్పేస్ దక్కించుకోబోతున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు
సో రవితేజని ఫ్యాన్స్ ఎలాగైతే కోరుకుంటున్నారో దానికి తగ్గట్టుగానే రవితేజ రెగ్యులర్ మాస్ కి పూర్తిగా దూరం జరిగారు. రివెంజ్ డ్రామా అంతర్లీనంగా ఉన్నప్పటికీ బలమైన ఎమోషన్స్ తో పాటు అయ్యప్ప స్వామికి సంబంధించిన థ్రెడ్ చాలా శక్తివంతంగా డిజైన్ చేశారట.
ఇది కనక క్లిక్ అయితే తెలుగులోనే కాదు తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా ఇరుముడి బాగా కనెక్ట్ అయిపోతుంది. అభిమానులు కోరుకుంటున్నది ఇలాంటి క్యారెక్టర్స్ లోనే. షూటింగ్ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో వేసవి విడుదలని టార్గెట్ చేయబోతున్నారు. ప్యాన్ ఇండియా మూవీస్ తో క్లాష్ కాకుండా సోలో విడుదలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates