టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 2026 మొదటి ఆరు నెలలు ఫుల్ ప్యాక్డ్ గా కనిపిస్తున్నాయి. జనవరిలో మన శంకరవరప్రసాద్ గారు పవర్ఫుల్ స్టార్ట్ ఇవ్వగా అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి.. సినిమాలు మంచి ప్రాఫిట్స్ తెచ్చాయి. ఇక మొదటి నెల ముగింపుకి రావడంతో అందరి ఫోకస్ మిగతా నెలలపై పడింది. సమ్మర్ సెలవులు బాక్సాఫీస్ కు అసలు అడ్వెంటేజ్.
ఇప్పటికే చాలా వరకు భారీ చిత్రాలు తమ రిలీజ్ డేట్స్ ను లాక్ చేసుకున్నాయి. ఫిబ్రవరి నుండి జూలై వరకు వరుసగా క్రేజీ సినిమాలు థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతున్నాయి. కొన్ని సినిమాల టార్గెట్ డేట్స్ రావాల్సి ఉన్నా.. ప్లాన్ మార్చుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఫిబ్రవరి 13న అనుదీప్-విశ్వక్ సేన్ ‘ఫంకీ’ సినిమాతో ఈ హడావుడి మొదలుకానుంది.
ఆ తర్వాత మార్చి, ఏప్రిల్ నెలలు సినిమాలతో కిక్కిరిసిపోనున్నాయి. మార్చి 19న లేదా ఏప్రిల్ 3న అడివి శేష్ ‘డెకాయిట్’ వచ్చే ఛాన్స్ ఉంది. అదే నెల 26న పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ ఫిలిం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సందడి చేయబోతోంది.
ఏప్రిల్ 10న నిఖిల్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’ తో పాటు శర్వానంద్ ‘బైకర్’ కూడా రిలీజ్ కి రెడీ కానుంది. మే నెల కూడా తక్కువేం లేదు. మే 1న రామ్ చరణ్ పాన్ ఇండియా ‘పెద్ది’ రానుంది. ఇక అక్కినేని అఖిల్ ‘లెనిన్’ కూడా మే రెండో వారంలో దిగొచ్చిన తెలుస్తోంది.
జూన్ చివరలో అంటే 25న నాని ‘ద ప్యారడైజ్’, 26న కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ వంటి చిత్రాలు క్యూలో ఉన్నాయి. ఇక జూలై 10న మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ రిలీజ్ కాబోతోంది. ఇది 2026 ఫస్ట్ హాఫ్ కు ఒక పర్ఫెక్ట్ ఎండింగ్ లా ఉండబోతోంది.
ఈ లైనప్ గమనిస్తే క్లాస్జ్ రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. చాలా వరకు మేకర్స్ తమ టార్గెట్ డేట్స్ ను ముందుగానే రిజర్వ్ చేసుకోవడం వల్ల ప్రమోషన్స్ కు కూడా మంచి టైమ్ దొరుకుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాలన్నీ పక్కాగా అనుకున్న సమయానికి వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి.
వరుసగా వస్తున్న ఈ సినిమాల వల్ల థియేటర్ల దగ్గర సందడి నెలకొనడంతో పాటు బాక్సాఫీస్ వసూళ్లు కూడా భారీగా వచ్చే ఛాన్స్ ఉంది. నేటి జనరేషన్ ఆడియన్స్ కు నచ్చే డిఫరెంట్ జోనర్ల సినిమాలు ఈ లిస్టులో ఉండటం విశేషం. ఇక ఏ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
This post was last modified on January 25, 2026 11:13 pm
మెగాస్టార్ చిరంజీవి ఏ వేదిక మీద మాట్లాడినా.. తన అభిమానుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తారు. అభిమానులే తనకు ఇంధనం అని…
టీమిండియా సెలక్షన్ లో పేరు లేకుంటే ‘జస్టిస్ ఫర్ సంజు శామ్సన్’ అనే ట్రెండ్ గత రెండేళ్లలో ఎక్కువగా కనిపించింది.…
వివాహేతర సంబంధాలు దేశంలో పెరుగుతున్నాయంటూ ఇటీవలే ఓ సర్వే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే వివాహేతర సంబంధాలు ఎలా ఉన్నా,…
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో మరోసారి టీమిండియా తన విశ్వరూపాన్ని చూపించింది. జనవరి 25న గౌహతిలోని బర్సపరా క్రికెట్ స్టేడియం…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ఆధ్మాత్మిక చింతన ఎక్కువన్న సంగతి తెలిసిందే. సనాతన ధర్మ పరిరక్షణ కోసం…
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 131 మందికి పద్మ అవార్డుల దక్కాయి. ఐదుగురికి…