టాలీవుడ్ జనాలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘ఉప్పెన’ ఒకటి. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నుంచి కొత్త కుర్రాడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సుకుమార్ ఆమోద ముద్ర వేసిన కథ, ఆయన పర్యవేక్షణలో తయారైన సినిమా ఇది. విజయ్ సేతుపతి లాంటి విలక్షణ నటుడు కథ, పాత్ర నచ్చి ఈ చిత్రంలో నటించాడు. ఇలా చాలా ప్రత్యేకతలే ఉన్నాయీ సినిమాలో.
ఈ కథ సినిమాగా మారడానికి ముందు చాలానే స్క్రుటినీ జరిగింది. మరి ఇంతమంది మెచ్చిన కథలో అంత ప్రత్యేకత ఏముంది అన్నది ఆసక్తికరం. చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక షాకింగ్ ట్విస్ట్ ఉందట. ఆ ట్విస్టును ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దానిపై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందట.
ఓ పేదింటి కుర్రాడు.. ఒక పెద్దింటి అమ్మాయి.. వీళ్ల మధ్య సాగే ప్రేమకథే ‘ఉప్పెన’. దర్శకుడు బుచ్చిబాబు సనా తన నిజ జీవిత అనుభవాల నేపథ్యంలోనే ఈ సినిమాను రూపొందించాడట. హీరోయిన్ తండ్రి పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. తన కూతురిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో హీరోకు అతను చేసే నష్టమే ఈ సినిమాలో అతి పెద్ద ట్విస్ట్ అని సమాచారం. అది కొంచెం జీర్ణించుకోలేని విధంగా, ఇప్పటిదాకా తెలుగులో మరే సినిమాలోనూ చూడని ఉంటుందట.
ఒకప్పుడు అయితే ఇలాంటి అంశాలు తెలుగు సినిమాల్లో పెట్టడానికి సాహసించేవాళ్లు కానీ.. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి మారి, ప్రయోగాలను, హార్డ్ హిట్టింగ్ అంశాలను బాగానే స్వీకరిస్తున్న నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు ఈ సాహసం చేసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీ ప్రముఖులకు ఈ సినిమా చూపించి మెజారిటీ జనాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ఫైనల్ కాపీని ఓకే చేసినట్లు సమాచారం. ఓవరాల్‌గా సినిమా బాగానే వచ్చిందని.. మెగా కుర్రాడికిది మంచి డెబ్యూ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.
This post was last modified on December 15, 2020 3:24 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…