వరస డిజాస్టర్లతో నితిన్ బాగా డిస్టర్బ్ అయిన మాట వాస్తవం. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు దారుణంగా బోల్తా కొట్టడం ఒక ఎత్తయితే, పెద్ద బడ్జెట్ తో ఎల్లమ్మని ప్లాన్ చేసుకున్న నిర్మాత దిల్ రాజు ఇప్పుడా ప్రాజెక్టుకి దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా చేయడం మరో ట్విస్టు. తెరవెనుక కారణాలు ఏమైనా ఒక మంచి మూవీ చేజారిన ఫీలింగ్ అభిమానుల్లో ఉంది.
తమ్ముడు కన్నా ముందు హ్యాట్రిక్ ఫ్లాపుల వల్ల బాగా రిస్క్ లో పడ్డ నితిన్ ఆ మధ్య విక్రమ్ కె కుమార్ తో స్వారీ టైటిల్ తో సినిమా చేస్తాడని తెగ ప్రచారం జరిగింది. యువి క్రియేషన్స్ నిర్మాణమంటూ ఊదరగొట్టారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఇక్కడితో అయిపోలేదు.
ప్రస్తుతం ఆనంద్ దేవరకొండతో సితార సంస్థ తీస్తున్న కల్ట్ కూడా ముందు నితిన్ చేతికి వచ్చిందే. ఎందుకో తెలియదు కానీ దర్శకుడు ఆదిత్య హాసన్ తన ఛాయస్ మార్చుకున్నాడు. సరే అయిందేదో అయ్యింది ఒక్క పెద్ద హిట్టు పడితే మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేయొచ్చనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురు చూస్తూ వచ్చారు. వాళ్ళ నిరీక్షణ ఫలించేలా ఉంది.
2024 ఆయ్ రూపంలో సర్ప్రైజ్ సూపర్ హిట్ సాధించిన దర్శకుడు అంజి కె మణిపుత్రకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇన్ సైడ్ టాక్. అధికారికంగా ప్రకటించలేదు కానీ నితిన్ స్వంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ లోనే దీన్ని రూపొందించేందుకు ప్లాన్ సిద్ధమైయ్యిందట.
అంతా ఒకే అనుకోగానే అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నారు. ఇది కాకుండా తెలుసు కదా ఫేమ్ నీరజ కోనతో ఒక మూవీ లాక్ చేసుకునే ప్లాన్ లో ఉన్న నితిన్ దాన్ని లేట్ చేస్తాడా లేక వరస క్రమం మారుస్తాడానేది తెలియాల్సి ఉంది. ఒకప్పుడు ప్రామిసింగ్ మార్కెట్ తో దూసుకుపోయిన స్టేజి నుంచి ఇప్పుడు ఒక్కొక్కటిగా అవకాశాలు, కాంబోలు మార్చే దశకు వచ్చిన నితిన్ నిజంగా అంజితో చేయి కలిపితే మంచి నిర్ణయం అవుతుంది.
ఎందుకంటే ట్రెండ్ కు తగ్గట్టు ఎంటర్ టైన్మెంట్ జోడిస్తే బడ్జెట్ తక్కువైనా బ్లాక్ బస్టర్లు సాధించవచ్చని గత ఏడాది కాలంలో చాలా సినిమాలు నిరూపించాయి. నితిన్ కూడా ఆ కోవలోనే హిట్టు కొట్టాలని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on January 24, 2026 10:54 am
స్టార్ హీరోల పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్. కొన్నేళ్ల నుంచి ఈ ఒరవడి కొనసాగుతోంది. ముఖ్యంగా…
ఒకేసారి రెండు సినిమాలు సెట్స్ మీద పెట్టడం ప్రభాస్ కు ఎంత మేలు చేస్తోందో అంతే మోతాదులో చేటు కూడా…
ప్రతి 12 సంవత్సరాలకు జరిగే గోదావరి నదీ పుష్కరాలు వచ్చే ఏడాది జరగనున్నాయి. గోదావరి నది ప్రవహించే ప్రతి రాష్ట్రంలోనూ…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత అత్యంత ఆసక్తి రేకెత్తించిన చిత్రాల్లో ‘విశ్వంభర’ ఒకటి. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ తీసిన…
బాహుబలి తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఏ సినిమా విజయవంతం అయినా.. దానికి సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు. తన…
వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి పవిత్ర ప్రసాదం.. లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని.. జంతువుల కొవ్వు సహా ఇతర…