ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. కాజల్ అగర్వాల్ ‘ఆచార్య’ సినిమా సెట్లో అడుగు పెట్టింది. ఈ సినిమాకు కథానాయికను ఖరారు చేయడంలో విపరీతమైన జాప్యం జరగడం తెలిసిన సంగతే. చివరికి కాజల్‌ను కథానాయికగా ఎంచుకున్నాక.. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఇంతలో చందమామ పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె నటిస్తుందా లేదా.. ‘ఆచార్య’లో ఉంటుందా లేదా అన్న సందేహాలు కలిగాయి.
ఐతే ఈ సందేహాలకు తెరదించుతూ తాజాగా కాజల్ ‘ఆచార్య’ సెట్లోకి అడుగు పెట్టింది. మెగాస్టార్ చిరంజీవి సైతం ఇదే సమయంలో సెట్‌కు రావడంతో ఇక ఈ సినిమా చిత్రీకరణ బ్రేకుల్లేకుండా సాగిపోతున్నట్లే. గత నెలలోనే ‘ఆచార్య’ చిత్రీకరణ పున:ప్రారంభం కాగా.. హీరో హీరోయిన్లు లేకుండానే షూటింగ్ జరిగింది. చిరు ఇటీవలే చిత్రీకరణకు సిద్ధమయ్యారు. ఇప్పుడు కాజల్ కూడా సెట్లోకి అడుగు పెట్టేసింది.
‘ఆచార్య’ సెట్లోకి కాజల్ సింగిల్‌గా ఏమీ రాలేదు. తన భర్త గౌతమ్ కిచ్లును కూడా వెంటబెట్టుకుని వచ్చింది. పెళ్లి తర్వాత పాల్గొనబోతున్న తొలి సినిమా షూటింగ్ కావడంతో ఫార్మాలిటీ కోసం భర్తను కూడా కాజల్ తీసుకువచ్చి ఉండొచ్చు. చిరు కొత్త జంటను సాదరంగా ఆహ్వానించడం మాత్రమే కాదు.. వారితో కేక్ కూడా కట్ చేయించారు. ఇద్దరితో కాసేపు ముచ్చట్లు కూడా చెప్పారు. సంబంధిత ఫొటోలు కూడా ట్విట్టర్లోకి వచ్చేశాయి.
‘ఆచార్య’ను ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే వేసవికి విడుదల చేయాలన్నది దర్శకుడు కొరటాల శివ ప్లాన్. లాక్ డౌన్ టైంలో స్క్రిప్టుకు మరింత మెరుగులు దిద్దుకుని, పక్కా షెడ్యూల్స్ వేసుకుని ఆయన చిత్రీకరణను పున:ప్రారంభించారు. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్న రామ్ చరణ్ సైతం త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటాడని అంటున్నారు. చిరు కుటుంబానికి చెందిన కొణిదెల ప్రొడక్షన్స్‌తో కలిసి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతాన్నందిస్తున్నాడు.
This post was last modified on December 15, 2020 3:11 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…