లాక్ డౌన్ టైంలో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌కు విపరీతమైన ఆదరణ దక్కింది. జనాలందరూ వరుసబెట్టి వివిధ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు తీసుకోవడం మొదలుపెట్టారు. ఆ ఫ్లాట్ ఫామ్స్ కూడా కొత్త సినిమాలను పెద్ద ఎత్తునే రిలీజ్ చేశాయి. ఐతే ఇలా ఓటీటీలు చెప్పిన రేటుకు సినిమాను ఇవ్వడం ఎందుకు.. మనమే సొంతంగా ఆన్‌లైన్లో రిలీజ్ చేసేద్దామని ఆన్ లైన్ థియేటర్లు తెరుచుకున్నారు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు.
ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ కూడా ఇలా ఆన్ లైన్ థియేటర్ మొదలుపెట్టింది. పే పర్ వ్యూ పద్ధతిలో ఇందులో సినిమాలు రిలీజ్ చేశారు. ముందుగా రామ్ గోపాల్ వర్మనే క్లైమాక్స్, నగ్నం, పవర్ స్టార్, థ్రిల్లర్ అంటూ వరుసబెట్టి ఇందులో సినిమాలు వదిలాడు.
మొదట్లో కుర్రాళ్లు బాగానే డబ్బులు పెట్టి ఆయన సినిమాలు చూసినట్లు కనిపించింది. వర్మకు బాగానే గిట్టుబాటు అయింది. కానీ వీటిలో విషయం తక్కువ, పబ్లిసిటీ హడావుడి ఎక్కువ అని అర్థమై చూడ్డం మానేశారు. ఆ ప్రభావం వేరే పే పర్ వ్యూ సినిమాల మీదా పడింది. ఈ మధ్య ఇలా రిలీజ్ చేస్తున్న ఏ సినిమాకూ ఆశించిన స్పందన ఉండట్లేదు. తాను తెరకెక్కించిన నర్తనశాల లోంచి చిన్న వీడియో బిట్ తీసి నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేస్తే పెద్దగా స్పందన లేకపోయింది. వర్మ ఈ మధ్య ఇలా రిలీజ్ చేస్తున్న సినిమాల గురించి పట్టించుకునేవాళ్లే లేరు. వేరే సినిమాల పరిస్థితీ అంతే.
హిందీలో ఖాలీపీలి, తమిళంలో కపె రణసింగం లాంటి సినిమాలను పే పర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేస్తే అనుకున్నంతగా రెవెన్యూ రాలేదు. ఇప్పుడు తెలుగులో సీనియర్ నిర్మాత ఎం.ఎస్.రాజు రూపొందించిన డర్టీ హరిని ఈ శుక్రవారం ఆన్ లైన్ థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికైతే పెద్దగా బజ్ కనిపించట్లేదు. ఇందులోని బోల్డ్ కంటెంట్ చూసి ఏమైనా కుర్రాళ్లు ఎగబడతారేమో చూడాలి.
This post was last modified on December 15, 2020 12:07 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…