Movie News

ఆదర్శ కుటుంబం… ఎందుకీ సీక్రెట్?

విక్టరీ వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం (AK47)’ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అయితే ఇటీవల ఒక ఇంట్రెస్టింగ్ లీక్ వచ్చిన విషయం తెలిసిందే. అదే నారా రోహిత్ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్త.

తాజాగా ఆయన సెట్స్‌లో జాయిన్ అవ్వడం, సచిన్ ఖేడేకర్, సాయి కుమార్ వంటి సీనియర్ నటులతో కలిసి సీన్స్ లో పాల్గొనడంతో ఈ విషయం ఇండస్ట్రీలో మరింత హాట్ టాపిక్‌గా మారింది.

లీక్ అవ్వగానే విషయం బాగా వైరల్ అయ్యింది. ఆ రేంజ్ లో వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా అప్డేట్ ఇస్తారని అందరూ అనుకున్నారు. కానీ టీమ్ మాత్రం సైలెంట్ గానే ఉంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా కన్ఫర్మ్ చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు అనేది ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న. జనరల్‌గా త్రివిక్రమ్ సినిమాల్లో కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఒక క్యారెక్టర్ గురించి ముందుగా చెబితే ఆ ఎఫెక్ట్ పోతుందని భావించి ఉండవచ్చు.

పైగా నారా రోహిత్ ఇందులో ఒక నెగటివ్ షేడ్స్ ఉన్న ‘యాంటీ కాప్’ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇలాంటి ఒక ఇంటెన్స్ రోల్‌ని టైమ్ చూసి రివిల్ చేస్తే బాగుంటుందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో నారా రోహిత్‌కు ‘పుష్ప’ సినిమాలో ఒక పవర్‌ఫుల్ రోల్ చేసే అవకాశం వచ్చిందని, కానీ కొన్ని కారణాల వల్ల అది మిస్ అయ్యిందని రోహిత్ క్లారిటీ ఇచ్చాడు.

ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆయనకు ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ దక్కడం విశేషం. వెంకీ మామ ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తున్న ఈ మూవీలో రోహిత్ క్యారెక్టర్ కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. 

అందుకే ఈ పాత్రకు సంబంధించిన స్టిల్స్ కానీ, అప్‌డేట్స్ కానీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ షూటింగ్ లో నారా రోహిత్ పై కీలకమైన యాక్షన్ డ్రామా సీక్వెన్స్ లు తీస్తున్నట్లు సమాచారం.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని, సర్ప్రైజ్ ని మెయింటైన్ చేయడమే బెటర్ అని టీమ్ భావిస్తోంది. ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి, బహుశా అప్పుడు ఈ క్యారెక్టర్ గురించి ఏదైనా అఫీషియల్ హింట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

This post was last modified on January 22, 2026 2:06 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Venkatesh

Recent Posts

చైతు లవ్ స్టోరీకి సరైన సమయం

నాగ చైతన్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయిన లవ్ స్టోరీని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రీ…

13 minutes ago

ఏపీలో వారికి సోషల్ మీడియా బ్యాన్?

సోషల్ మీడియా…రెండు వైపులా పదునున్న కత్తి. పిల్లల నుంచి పెద్దల వరకు టెక్ యుగంలో ఏదో ఒక సోషల్ మీడియా…

36 minutes ago

రాజమౌళిని మెప్పించిన మందాకిని రక్తపాతం

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తున్న హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది బ్లఫ్' ట్రైలర్ వారం క్రితమే రిలీజయింది. బాలీవుడ్…

48 minutes ago

చిరంజీవి తనయ కోసం ఇద్దరి పేర్లు

వాల్తేరు వీరయ్య కాంబినేషన్ రిపీట్ చేస్తూ చిరంజీవి చేయబోతున్న మెగా 158 కోసం దర్శకుడు బాబీ క్యాస్టింగ్ ఫైనల్ చేసే…

1 hour ago

విచిత్రంగా ఉండబోతున్న అనిల్ పదో సినిమా

దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి మేఘాల్లో తేలిపోతున్నారు. గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో వెంకటేష్ కో బ్లాక్ బస్టర్ ఇచ్చి…

1 hour ago

70 ఏళ్ల వయసులో వైరల్ వ్లాగ్: 3 రోజుల్లో 3 కోట్లు

సోషల్ మీడియాలో సక్సెస్ అవ్వడానికి వయసుతో సంబంధం లేదని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వినోద్ కుమార్ శర్మ నిరూపించారు. 70…

2 hours ago