సంక్రాంతి సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘మన శంకర వరప్రసాద్’ క్లియర్ విన్నర్ అనడంలో మరో మాట లేదు. ఇక బడ్జెట్, వసూళ్ల లెక్కల్లో చూస్తే తర్వాతి స్థానం నవీన్ పొలిశెట్టి చిత్రం ‘అనగనగా ఒక రాజు’నే. పరిమిత బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా వంద కోట్ల వసూళ్ల మార్కును అందుకుని నవీన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. రెండో వారంలోనూ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బలంగా నిలబడుతోంది.
ఈ సినిమాలో నటన పరంగా నవీన్ పొలిశెట్టిది వన్ మ్యాన్ షో అనడంలో సందేహం లేదు. రైటింగ్‌లోనూ తన పాత్ర ఎంతో కీలకం. ఐతే ఈ సినిమాకు స్క్రిప్టు రాసింది అతనొక్కడే కాదు. తనతో పాటు చిన్మయి ఘాట్రాజు అనే లేడీ రైటర్.. కథ, స్క్రీన్ ప్లే, మాటల క్రెడిట్ తీసుకుంది. అంతే కాక ఆమెకు క్రియేటివ్ డైరెక్టర్ అనే ఇంకో క్రెడిట్ కూడా ఇచ్చారు. ఇలా ఒక అమ్మాయి హీరోతో కలిసి స్క్రిప్టు రాయడం.. మేకింగ్‌లో కూడా భాగం కావడం అరుదైన విషయమే.
ఇంతకీ ఈ చిన్మయి ఘాట్రాజు ఎవరన్నది ఆసక్తికరం. ఆమె ఇండస్ట్రీకి కొత్తేమీ కాదు. 2012లో విడుదలైన ప్రవీణ్ సత్తారు తొలి చిత్రం ‘ఎల్బీడబ్ల్యూ’లో ఆమె ఒక కథానాయికగా నటించింది. ఇంకా లవ్లీ, మై హీరో కలామ్, చమ్మక్ చల్లో లాంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది చిన్మయి. కానీ తర్వాత నటిగా ఆమె కెరీర్ ముందుకు సాగలేదు. ఆపై ఆమె రైటర్ అవతారం ఎత్తింది. నవీన్‌తో పరిచయం కావడం, అతడికి ఆమె రైటింగ్ స్టైల్ నచ్చడంతో ఇద్దరూ కలిసి ‘అనగనగా ఒక రాజు’ స్క్రిప్టు రాశారు.
నిజానికి ఇది ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ డైరెక్ట్ చేయాల్సిన సినిమా. కానీ ఎందుకో అతను ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. ఒక దశలో ఈ సినిమా ఆగిపోయింది కూడా. కానీ నవీన్ ఈ ప్రాజెక్టు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. చిన్మయితో కలిసి స్క్రిప్టు రాశాడు. ఆ తర్వాత ఈ చిత్రానికి తమిళుడైన మారిని దర్శకుడిగా ఎంచుకున్నారు. ఈ స్క్రిప్టుకు నిర్మాత నాగవంశీ పచ్చజెండా ఊపడంతో సినిమా ముందుకు కదిలింది.
This post was last modified on January 21, 2026 10:56 pm
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్ రావును సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే.…
నిబద్ధతతో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉంటారు. విధి నిర్వహణలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా పనిచేసి ఇటు ప్రజల..అటు…
తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి…
ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని…
రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి కష్టాల కడలి అంత సులభంగా…
మార్చి 27 విడుదలని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన పెద్ది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే రీతిలో సోషల్ మీడియాలో ఒక…