సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేసే అవకాశాన్ని వదులుకున్న తమిళ సీనియర్ దర్శకుడు సుందర్.సి.. ఇప్పటికే తనతో రెండు సినిమాలు చేసిన విశాల్‌తో జట్టు కట్టిన సంగతి తెలిసిందే. సైలెంటుగా ఆ సినిమాను మొదలుపెట్టి కొంత చిత్రీకరణ కూడా జరిపిన సుందర్.. సడెన్ సర్ప్రైజ్ అన్నట్లుగా ఈ సినిమా టైటిల్ టీజర్ వదిలాడు. అది చాలా క్రేజీగా సాగి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది.
ఇటీవలే రిలీజైన సమంత సినిమా మా ఇంటి బంగారం టీజర్‌తో దీనికి పోలిక ఉండడం విశేషం. పైకి పద్ధతైన ఇల్లాలిలా కనిపిస్తూ… తన అత్తారింటిలోనే రౌడీలను మట్టుబెట్టే పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది సమంత. సుందర్ సినిమాలో విశాల్ కూడా ఇలాంటి పాత్రే చేస్తున్నట్లున్నాడు. ఈ సినిమాకు పురుషన్ ( తెలుగులో మొగుడు ) అనే టైటిల్ పెట్టిన సుందర్.. టీజర్‌తో ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యాక్షన్ ప్రియులకూ కావాల్సినంత మసాలా అందించాడు.
ఇంట్లో సతీమణికి సేవలు చేసుకునే పద్ధతైన భర్తగా విశాల్ పాత్రను పరిచయం చేసి.. ఇంటికొచ్చిన అతిథికి టీ పెట్టడం కోసం వంట గదిలోకి వెళ్లి అక్కడ తన మీద దాడికి వచ్చిన రౌడీ బ్యాచ్ బెండు తీసే నేపథ్యంలో ఈ టీజర్ సాగింది. టీజర్‌ను ఒకలా మొదలుపెట్టి.. ఇంకోలా ముగించిన తీరు ఆకట్టుకుంది.
సీరియల్ నటుడి పాత్రలో యోగి బాబు పండించిన హాస్యం టీజర్లో మేజర్ హైలైట్. విశాల్ ఇల్లాలి పాత్రలో తమన్నా కనిపించగా.. భర్త ముందే ఆమెకు యోగిబాబు సైట్ కొట్టడం.. విశాల్‌ను తక్కువగా అంచనా వేసిన అతను తర్వాత వంట గదికి వెళ్లి తన విధ్వంసాన్ని చూసి షాకవ్వడం.. ఈ క్రమంలో అతడి వన్ లైనర్స్ కావాల్సినంత వినోదాన్ని పంచాయి.
సుందర్ అంటే మాస్ అంశాలు, కామెడీకి కేరాఫ్ అడ్రస్. ఐతే తన సినిమాలు మరీ రొటీన్‌గా ఉంటాయనే విమర్శలున్నాయి. పురుషన్ కూడా కొత్తగా అనిపించకపోయినా.. మాస్ మెచ్చే యాక్షన్, ఎంటర్టైన్మెంట్‌కు లోటు ఉండదని టీజర్ చూస్తే అర్థమైంది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు. టీజర్ పూర్తయ్యాక సుందర్, తమిళ, విశాల్ మధ్య సంభాషణ కూడా ఫన్నీగా సాగడంతో ఈ టీజర్‌కు ఫుల్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
This post was last modified on January 21, 2026 10:53 pm
తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి…
ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ సంస్థ ఐ-ప్యాక్ (I-PAC) ఆర్థిక లావాదేవీలపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకున్నాయి. 2021లో ఈ సంస్థ హర్యానాలోని…
రాజకీయ రంగప్రవేశానికి ముందు విజయ్ చివరి సినిమాగా విపరీతమైన ప్రచారానికి నోచుకున్న జన నాయకుడుకి కష్టాల కడలి అంత సులభంగా…
మార్చి 27 విడుదలని ముందు నుంచి చెప్పుకుంటూ వచ్చిన పెద్ది ఖచ్చితంగా వాయిదా పడుతుందనే రీతిలో సోషల్ మీడియాలో ఒక…
మన శంకర వరప్రసాద్ గారుకి ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు నుంచి రెగ్యులర్ టికెట్ ధరలు అందుబాటులోకి వచ్చేశాయి. జిఓలో…
మరో ఆరు రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కీలకంగా అమరావతి రాజధానికి…