తెలంగాణ హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలు నిర్మాతల్లోనే కాదు వివిధ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. నిర్మాతలు తొంభై రోజుల ముందే అప్లై చేసుకుని టికెట్ రేట్ల పెంపు తీసుకోవాలని తేల్చి చెప్పిన నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాలకు ఇదో సవాల్ గా మారనుంది.
ఎందుకంటే ఫలానా తేదీకి రిలీజ్ చేస్తామని చెప్పి ఖచ్చితంగా దానికే కట్టుబడి ఉండే పరిస్థితులు ఇప్పుడు లేవు. రాజా సాబ్ అయినా ప్యారడైజ్ అయినా అన్నింటిది ఒకే కథ. కొన్నిసార్లు జన నాయకుడు లాంటి వాటికి సెన్సార్ నుంచే వచ్చే ఇబ్బందులు బోనస్ చిక్కులు తెచ్చి పెడతాయి. అలాంటప్పుడు అంత అడ్వాన్స్ ప్లాన్డ్ ఉండటం అనుకున్నంత సులభం కాదు.
ఇక్కడ ఓటిటిల వైపు నుంచి సమస్యలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అగ్రిమెంట్ చేసుకునే టైంలోనే నిర్మాత ఫలానా తేదీకి రిలీజ్ చేస్తామని స్పష్టంగా పేర్కొంటారు. దానికి అనుగుణంగానే ఓటిటిలు వాటి ప్రీమియర్లను షెడ్యూల్ చేసుకుంటాయి. అప్పుడప్పుడు మార్పులు ఉంటాయి. ఏదైనా అనూహ్యమైన పరిస్థితులు తలెత్తితే తప్ప మినహాయింపులు ఉండవు.
అలాంటప్పుడు జిఓ కోసం నిర్మాతలు కనక మూడు నెలల ముందు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే దాన్నే ఓటిటి ఒప్పందాల్లో చూపించుకోవాలి. దానికి కట్టుబడకపోతే ఇటు ప్రభుత్వం, కోర్టు అటు ఓటిటిలతో కొత్త ఇబ్బంది వచ్చి పడుతుంది. నిర్మాతల ఆందోళన ఇదే.
ఇప్పటికిప్పుడు దీని గురించి ఎలాంటి కంక్లూజన్స్ కు రాలేం కానీ ఏదైనా ప్యాన్ ఇండియా మూవీ విడుదల దగ్గరలో ఉన్నప్పుడు వీటి తాలూకు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. పెద్ది, ప్యారడైజ్ లాంటి బిగ్గీలతో పాటు టాక్సిక్ లాంటి డబ్బింగులు సైతం హైక్స్ కోరుకునేవే.
ఇదంతా ఒక రకమైన అయోమయానికి దారి తీసే ప్రమాదం లేకపోలేదు. టికెట్ రేట్ల మీద మళ్ళీ ఎవరు కోర్టుకి వెళ్లినా అంత సులభంగా అయితే తేలదు. ముప్పై రోజుల నిడివి ఇచ్చి ఉంటే బాగుండేదని, కానీ మూడు నెలలు మరీ ఎక్కువ గడవని, ప్రాక్టికల్ గా చూస్తే ఇది మీట్ కావడం కొందరికే సాధ్యమని ఓపెన్ గా కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on January 21, 2026 1:15 pm
ది రాజా సాబ్ విషయంలో కలిగిన అసంతృప్తిని ప్రభాస్ అభిమానులు ఇప్పుడప్పుడే మర్చిపోయేలా లేరు. దర్శకుడు మారుతీని టార్గెట్ చేస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. వచ్చే వారం ప్రారంభమయ్యే…
తన సోదరుడు కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంది. సికింద్రాబాద్ ను…
నారి నారి నడుమ మురారి సక్సెస్ ని ఆస్వాదిస్తున్న శర్వానంద్ ముందులాగా గ్యాప్ ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. ప్రేక్షకులకు కంటిన్యూగా…
మరో పాదయాత్రకు మాజీ సీఎం జగన్ సిద్ధం అవుతున్నారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రజలతో మమేకం కావాలని భావిస్తున్నారు. దీనిపై…
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో ప్రసంగించిన రేవత్ రెడ్డి కీలక సూచన చేశారు. ఇకపై, ప్రతి సంవత్సరం జూలై…