పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. మళ్లీ సినిమాలు చేయాలనుకున్నాక ఎంచుకున్నది సామాజిక అంశాలతో కూడిన, మహిళల సమస్యల మీద చర్చించే సినిమాను. దీని పట్ల ఆరంభంలో అభిమానుల నుంచి నిరాసక్తత వ్యక్తమైంది. ఐతేనేం.. సినిమా పట్టాలెక్కాక, ఫస్ట్ లుక్ వదిలాక నెగెటివిటీ అంతా పక్కకు వెళ్లిపోయింది.
వకీల్ సాబ్ అనే టైటిల్, స్టైలిష్ ఫస్ట్ లుక్ మొత్తం కథ మార్చేశాయి. వకీల్ సాబ్ సోషల్ మీడియాను ఏలడం మొదలుపెట్టాడు. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ కాలేదు. ఐతేనేం ట్విట్టర్లో ఈ ఏడాది అత్యధికంగా ట్రెండ్ అయిన తెలుగు మూవీ హ్యాష్ ట్యాగ్ ఇదే కావడం విశేషం. మొత్తంగా సౌత్ ఇండియా లెవెల్లో వకీల్ సాబ్ హ్యాష్ ట్యాగ్ రెండో స్థానంలో నిలిచింది.
తమిళ స్టార్ విజయ్ మూవీ మాస్టర్ అగ్ర స్థానాన్ని దక్కించుకుంది. ఐతే ఆ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. టీజర్ కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ గురించి ఎంతో చర్చ నడిచింది. కానీ వకీల్ సాబ్ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ మాత్రమే వదిలారు. టీజర్ కూడా రాలేదు. అయినా సరే.. దాని హ్యాష్ ట్యాగ్ సౌత్ ఇండియాలో రెండో స్థానంలో, తెలుగు వరకు అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు లాంటి సినిమాల్ని వెనక్కి నెట్టి అగ్ర స్థానంలో నిలవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
ఇదిలా ఉండగా.. వకీల్ సాబ్ ట్విట్టర్ ఘనతను నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఓ కొత్త పోస్టర్ వదిలింది. ఇంతకుముందు లీక్ అయి సంచలనం రేపిన పవన్ ఫొటో ఒరిజినల్‌ను ఇప్పుడు రిలీజ్ చేయడం విశేషం. అది వెంటనే ట్విట్టర్లో వైరల్ అయిపోయింది.
This post was last modified on December 15, 2020 10:09 am
వైసీపీ కీలక నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఓ రేంజిలో న్యాయ పోరాటం చేస్తున్నారు. తిరుపతి…
వైసీపీ అధినేత జగన్ వ్యవహార శైలి కేవలం ప్రధాన ప్రతిపక్షం కోసమే ఆరాటపడుతున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుతం ఆయనకు…
ఏపీలో రిలీజ్ సినిమాల ప్రదర్శనలపై కూటమి సర్కారు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా రిలీజ్ అయ్యే దాదాపుగా అన్ని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏది చేసినా చాలా వెరైటీగా ఉంటుంది. ఇతర రాజకీయ నాయకులతో…
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…