Movie News

పూజా హెగ్డే ‘క్యార్ వాన్’ గోల… వైరల్ వార్తల్లో నిజమెంత?

ఇటీవల పూజా హెగ్డే ఒక స్టార్ హీరోపై సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ తిరుగుతోంది. ఒక పాన్ ఇండియా సినిమా షూటింగ్ టైమ్‌లో ఒక టాప్ హీరో తన పర్మిషన్ లేకుండా క్యార్ వాన్‌లోకి వచ్చారని, దానికి తాను గట్టిగా వార్నింగ్ ఇచ్చానని పూజ అన్నట్లు కథనాలు గట్టిగానే అల్లేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్‌ల ప్రకారం.. ఆ గొడవ తర్వాత సదరు హీరో పూజతో మళ్ళీ వర్క్ చేయడానికి ఇష్టపడలేదని, కానీ తన సెల్ఫ్ రెస్పెక్ట్ ముందు అవేవీ ముఖ్యం కాదని ఆమె చెప్పినట్లు ప్రచారం సాగుతోంది. 

కొన్ని వెబ్ సైట్లు అయితే ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో పూజ స్వయంగా వెల్లడించినట్లు కథనాలు అల్లేశాయి. దీనితో ఆ హీరో ఎవరై ఉంటారా అని నెటిజన్లు రకరకాలుగా గెస్ చేస్తున్నారు. అయితే, ఈ వార్తల్లో అసలు వాస్తవం ఎంత ఉందనేది పరిశీలిస్తే షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి.

నిజానికి పూజా హెగ్డే ఇటీవల ఎక్కడా ఇలాంటి కామెంట్స్ చేసినట్లు ఆధారాలు లేవు. ఆమె పాల్గొన్న ఏ ఇంటర్వ్యూలో గానీ లేదా సోషల్ మీడియా అకౌంట్స్ లో గానీ ఇలాంటి మాటలు అన్నట్లు వీడియోలు ఎక్కడా కనిపించడం లేదు. 

కొన్ని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇది కేవలం కావాలని ఎవరో సృష్టించిన ఫేక్ న్యూస్ మాత్రమే అని తెలుస్తోంది. సాధారణంగా సెలబ్రిటీల గురించి చిన్న గాసిప్ దొరికినా సోషల్ మీడియాలో కథలు అల్లడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఎవరో క్రియేట్ చేసిన ఫేక్ పోస్ట్ వల్లే నిజానిజాలు తెలుసుకోకుండానే వైరల్ చేశారని అనిపిస్తోంది.

ఒక ప్రొఫెషనల్ నటిగా పూజ ఇప్పటివరకు ఎందరో స్టార్ హీరోలతో పని చేశారు కానీ, ఎప్పుడూ ఇలాంటి ఇబ్బందులు వచ్చినట్లు ఆమె చెప్పలేదు. ఇక పూజా హెగ్డే టీమ్ కూడా పెద్దగా దీన్ని పట్టించుకోలేదు. ప్రస్తుతం అమ్మడు తన కొత్త సినిమాల పనులతో బిజీగా ఉంది. నెక్స్ట్ జననాయగన్ ప్రేక్షకుల ముందుకు రానుంది.

This post was last modified on January 20, 2026 8:26 am

Share

Recent Posts

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

54 minutes ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

2 hours ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

2 hours ago

ఫ్యాన్ బుగ్గ గిల్లుడు… షాక్ అయిన హీరోయిన్

ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…

3 hours ago

‘ఏకం’తో లోకల్ వార్ లోకి కేకే సర్వే కిరణ్!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…

4 hours ago

సరిహద్దులు దాటిన పీఓకే బాలిక.. తిరిగి వెళుతుందా?

భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…

4 hours ago