అంచనాలకు మించి ఆడేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు కొన్ని ప్యాన్ ఇండియా సినిమాలకు సైతం సాధ్యం కాని రికార్డులను చాలా అలవోకగా దాటేస్తున్నాడు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఈ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవుతారని ఊహించిన వాళ్ళు తక్కువ.
ఎనిమిదో రోజే ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల గ్రాస్ వసూలు చేయడమే కాక నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మైలురాయిని అందుకుని మెగాస్టార్, అనిల్ రావిపూడి కెరీర్ లో మరో కొత్త మైలురాయిని జోడించింది. రెండో వారం పూర్తి కాకుండా ఈ స్థాయిలో అరాచకం చేయడం చూస్ మెగా ఫ్యాన్స్ సంతోష పడుతున్న వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
వచ్చే రెండు వారాలు చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో మన శంకరవరప్రసాద్ గారు ఇప్పట్లో తగ్గడం కష్టమే అనిపిస్తోంది. రాజా సాబ్ ఫలితం తేలిపోయింది కాబట్టి రెండో వారం నుంచి దాని థియేటర్లలో గణనీయమైన కోత పడుతుంది. అలా దొరికిన స్క్రీన్లు మెగామూవీకి అధికంగా, తర్వాత అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారికి సర్దుతున్నారు.
ఉన్నంతలో భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా బాగానే లాగేందుకు కష్టపడుతోంది. ఇప్పుడు ఫ్యాన్స్ పెట్టుకున్న టార్గెట్ నాలుగు వందల కోట్ల గ్రాస్. ఇది ఈజీ కాదు కానీ అసాధ్యమని చెప్పలేం. ఎందుకంటే ట్రెండ్ గమనిస్తే ఇంకో వారంలోపే ఈ లాంఛనం అయిపోవచ్చు.
దర్శకుడు అనిల్ రావిపూడి ఊరూరా తిరుగుతూ సక్సెస్ సెలబ్రేషన్స్ ని ఫ్యాన్స్ తో పాటు జరుపుకుంటున్నారు. నిర్మాత సాహు గారపాటి వెంటే ఉన్నారు. హీరోయిన్ నయనతార వచ్చే ఛాన్స్ లేకపోవడం, చిరంజీవి ప్రతి చోటికి రాలేని పరిస్థితి ఉండటం వల్ల ఏ ప్రమోషన్ అయినా సరే అనిల్ రావిపూడి ఒక్కడే చేసుకోవాల్సి వస్తోంది.
త్వరలో సక్సెస్ మీట్ జరిపే ఆలోచన జరుగుతోంది కానీ ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. ఇప్పుడు త్రీ హండ్రెడ్ క్రోర్ టార్గెట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడేమైనా ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఫ్యాన్స్ అయితే దాని కోసం ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఓపెన్ గ్రౌండ్ లో చేయమని కోరుతున్నారు.
This post was last modified on January 20, 2026 8:54 am
ఒకప్పుడంటే మెగాస్టార్ చిరంజీవిని, ఆయన సినిమాలను అల్లు అర్జున్ కొనియాడడం పెద్ద విశేషంగా అనిపించేది కాదు. కానీ గత కొన్నేళ్లలో…
ఏపీ లిక్కర్ కేసులో ఈడీ విచారణను ఎదుర్కోనున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన ట్వీట్లతో రాజకీయ వర్గాల్లో…
కేరళ రాష్ట్రంలో ఇప్పుడొక వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీపక్ అనే 42 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతం…
టాలీవుడ్ లో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత తీవ్రంగా ఉంది. అందులోనూ తమ భుజాల మీద సినిమాను మోసి నిలబెట్టే…
టాలీవుడ్ కోరుకున్న శుభారంభం 2026కి దొరికేసింది. సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో నాలుగు పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాక మన శంకరవరప్రసాద్…
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన…